పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నూతనగరళస్తని (2-175-క. )

2-175-క.

నూన గరళస్తని యగు
పూనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై
చేనముల హరియించి ప
రేనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్.

టీకా:

నూతన = కొత్తగా పూసుకొనిన, వింత; గరళ = విషము కల; స్తని = పాలిండ్లు కలది; అగు = అయిన; పూతనఁన్ = పూతనను; పురిటింటి = పురిటిశుద్ధి ఇంకా కాని ఇంటి; లోనఁన్ = లోనే; పొత్తుల = పొత్తిళ్ళ లోని {పొత్తిళ్ళు - పుట్టిన కొత్తలో చంటిపిల్లలను ఉంచు మెత్తటి గుడ్డల దొంతరలు, అలాగే పిల్లలు ఆటబొమ్మలకి వాడు గుడ్డలు}; శిశువు = చంటివాడు; ఐ = అయి ఉండగ; చేతనములున్ = ప్రాణములను; హరియించి = హరించి, పీల్చి; పరేత = యముని; నగరమునకున్ = పురమునకు; అనిచెఁన్ = పంపించెను; కృష్ణుండు = కృష్ణుడు; పెలుచన్ = ఆగ్రహముతో.

భావము:

శ్రీకృష్ణుడు పురుటింటిలో చంటిబిడ్డగా పొత్తిళ్ళలో ఉన్న సమయ మది. పాలిళ్ళలో ప్రత్యేక విషం కలిగిన పూతన అనే రాక్షసి పాలివ్వటానికి వచ్చింది. ఆ శైశవ కృష్ణుడు ఆమె ప్రాణాలను తాగేసి యమలోకానికి పంపేసాడు.