పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నిరయమునకుఁ (8-644-ఆ.)

8-644-ఆ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును
దవిహీనతకును బంధనమున
ర్థ భంగమునకు ఖిల దుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు.

టీకా:

నిరయమున్ = నరకమున; కునున్ = కు; ప్రాప్త = కలిగిన; నిగ్రహంబున్ = చెరపట్టబడుటకు; కునున్ = కు; పద = పదవి; విహీనత = పోవుట; కునున్ = కు; బంధనమున్ = బంధింపబడుట; కున్ = కు; అర్థ = సంపదల; భంగమున్ = నశించినందుల; కునున్ = కు; అఖిల = సమస్తమైన; దుఃఖమున్ = దుఃఖముల; కున్ = కు; వెఱవన్ = బెదరను; దేవ = భగవంతుడా; బొంక = అబద్దమాడుటకు; వెఱచిన్ = బెదరెడి; అట్లు = విధముగా.

భావము:

భగవాన్! నరకానికి పోడం కన్నా, శిక్షింపపడటం కన్నా, ఉన్నతమైన పదవి పోడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రాడం కన్నా కూడ అసత్యం చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా.
వామనావతారంలో త్రివిక్రమరూపం ప్రదర్శించిన అనంతరం రెండడుగులకు విశ్వం సరిపోయింది, మూడో అడుగుకు చోటు ఎక్కడో చూపు అనిన విష్ణుమూర్తికి సమాధానం చెప్తూ. ఏమైనా అసత్యం పలకను అని చెప్పి మూడవ అడుగుకు బలిచక్రవర్తి తన తలమీద చూపించాడు