పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నీలోన లేని చోద్యము (10.1-1241-క.)

10.1-1241-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీలోన లేని చోద్యము
లేలోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్నింగిని దిక్కుల;
నీలోచోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!"

టీకా:

నీ = నీ; లోనన్ = అందు; లేని = లేనట్టి; చోద్యములు = వింతలు; ఏ = ఏ ఒక్క; లోకములు = లోకము {త్రిలోకములు - 1స్వర్గ 2మర్త్య 3పాతాళ లోకములు}; అందున్ = లోను; చెప్పరు = ఉన్నవని తెలుపుటలేదు; నీటన్ = నీటిలోను; నేలన్ = నేలమీద; నింగినిన్ = ఆకాశమునందు; దిక్కులన్ = నలుదిక్కులందు {నలుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము}; నీ = నీ; లోన్ = అందు; చోద్యంబులు = వింతలు; ఎల్లన్ = అన్నియు; నెగడు = వర్ధిల్లును; మహాత్మా = గొప్పవాడా.

భావము:

సమస్తమైన వింతలు నీలోనే ఉన్నాయి కదా మహానుభావ! నీలో లేని వింతలు నీళ్ళల్లో కాని, నేలమీద కాని, ఎక్కడికి వెళ్ళినా ఏ లోకంలోను ఉన్నట్లు పెద్ద లెవరు చెప్పలేదు స్వామి.