పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నీలగళాపరాధి (4-94-ఉ.)

4-94-ఉ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా?
చాలుఁగుమర్త్య! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి
న్నేధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్
గాలుపనే? తలంప జనకా!కుటిలాత్మక! యెన్ని చూడఁగన్.

టీకా:

నీలగళా = శివుని యెడల {నీలగళుడు - నీల (నల్లని) గళ (గొంతుక) కలవాడు, శివుడు}; అపరాధి = అపరాథము చేసినవాడు; అగు = అయిన; నీకున్ = నీకు; తనూభవన్ = పుత్రికను; అగుటన్ = అవుట; చాలదా = సరిపోదా; చాలున్ = చాలు; కుమర్త్య = చెడుమనిషి; నీదు = నీ యొక్క; తనూజాతన్ = కూతురను; అనన్ = అనగా; మదిన్ = మనసున; సిగ్గు = లజ్జ; పుట్టెడిన్ = పుడుతున్నది; ఏల = ఎందులకు; ధరన్ = భూమిమీద; మహాత్ముల్ = గొప్పవారి; కిన్ = కి; ఎగ్గు = అపకారము; ఒనరించెడి = చేసెడి; వారి = వారియొక్క; జన్మముల్ = పుట్టుకలు; కాలుపనే = కాల్చుటకా ఏమి; తలంప = తలచుకొంటే; జనకా = తండ్రీ; కుటిలాత్మకా = వంకరబుద్దికలవాడ; ఎన్ని = ఎంచి; చూడగన్ = చూస్తే.

భావము:

"తండ్రీ! లోకకల్యాణంకోసం కాలకూటవిషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమ శివుడు. ఆయన యెడ క్షమింపరాని అపరాధం చేసావు. నా దురదృష్టం కొద్దీ అలాంటి నీకు పుత్రికగా పుట్టాను నీచమానవ. ఇక చాల్లే. నీ కుమార్తె నని తల్చుకుంటేనే సిగ్గు వేస్తోంది. లోకంలో గౌరవనీయులకు కీడు తలపెట్టే నీలాంటి వాళ్ళ పుట్టుకలు ఎందుకయ్యా? కాల్చడానికా. పూడ్చడానికా.