పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నిగమములు వేయుఁ జదివిన (1-141-క.)

1-141-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిమములు వేయుఁ జదివిన
సుమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుమంబు భాగవత మను
నిమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"

టీకా:

నిగమములు = వేదములు; వేయున్ = వేలకొలది; చదివినన్ = పఠించినను; సుగమంబులు = సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్ = సౌభాగ్యములు; సుగమంబు = సులభము అగును; భాగవతము = భాగవతము; అను = అనబడే; నిగమంబున్ = వేదమును; పఠింప = చదివినచో; ముక్తి = ముక్తి; నివసనము = లభించుట; బుధా = జ్ఞానవంతుడా.

భావము:

జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది."