పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నీ పాదకమల సేవయు (10.1-1272-క.)

10.1-1272-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీ పాదకమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాసమందార! నాకు యచేయఁ గదే!"

టీకా:

నీ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల యందు; సేవయున్ = భక్తి; నీ = నీ యొక్క; పాద = పాదముల; అర్చకుల = భక్తుల; తోడి = తోటి; నెయ్యమును = స్నేహము; నితాంత = విస్తారమైన; అపార = అంతులేని; భూత = జీవుల యెడ; దయయును = దయకలిగి యుండుట; తాపసమందార = కృష్ణ {తాపసమందారుడు - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; నా = నా; కున్ = కు; దయచేయగదే = అనుగ్రహింపుము.

భావము:

తపస్వులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు.