పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నా పట్టి పొట్ట నిండఁగఁ (10.1-323-క.)

10.1-323-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా ట్టి పొట్ట నిండఁగఁ
బైడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ;
డూపిరి వెడలదు; వానిం
జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!

టీకా:

నా = నా యొక్క; పట్టి = పిల్లవాని; పొట్ట = కడుపు; నిండగన్ = నిండా; పైన్ = మీద; పడి = ఎక్కి; నీ = నీ యొక్క; పట్టి = పిల్లవాడు; వెన్నన్ = వెన్నను; బానెండు = పెద్దకుండెడు; ఇడినాడు = పెట్టాడు; ఊపిరి = శ్వాస; వెడలదు = రావటంలేదు; వానిన్ = అతనిని; చూపెదన్ = చూపించెదను; ఏమైనన్ = ఏదైనాప్రమాదముజరిగితే; నీవ = నీవే బాధ్యురాలవు; సుమ్ము = సుమా; లతాంగీ = సుందరీ.

భావము:

పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకొచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా.