పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కవకవనై (6-100-క.)

6-100-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కవనై పదనూపుర
రవ లాగుబ్బుకొన్న తిపతి గతులం
జిచివనై విటు చెవులకు
ళిన్ రతిసల్పు రతుల వరవ గనియెన్.

టీకా:

కవకవను = కవకవమనెడి ధ్వనించునవి; ఐ = అయ్యి; పదనూపుర = కాలిగజ్జలు; రవరవలు = ధ్వనులు; ఆగుబ్బుకొన్న = అతిశయించుతున్న; రతిపతి = మన్మథ; గతులన్ = క్రీడలో; చివచివన్ = చివచివలాడెడిది; ఐ = అయ్యి; విటు = విటుని; చెవులు = చెవుల; కున్ = కు; రవళిన్ = చిరుశబ్దముతో; రతిన్ = సంగమించుటను; సల్పు = సలుపెడి; రతుల = అనురాగపు; రవరవన్ = స్పర్ధను; కనియెన్ = కాంచెను.

భావము:

వెలయాలి కాలి అందెలు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ ఘల్లు ఘల్లు మంటున్నాయి. ఆ గజ్జల రవాలు విటునికి వీనుల విందులు చేస్తున్నాయి. ఇలా ఒకరి పైకి ఒకరు ఎగబడుతు సాగిస్తున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు ఆలోకించాడు.