పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కట్టుము సేతువు (9-285-క.)

9-285-క.

ట్టుము సేతువు; లంకం
జుట్టుము; నీ బాణవహ్ని సురవైరితలల్
గొట్టుము నేలంబడఁ; జే
ట్టుము నీ యబల నధికభాగ్యప్రబలన్.

టీకా:

కట్టుము = నిర్మించుము; సేతువున్ = వంతెనను; లంకన్ = లంకానగరమును; చుట్టుము = చుట్టుముట్టుము; నీ = నీయొక్క; బాణ = బాణముల; వహ్నిన్ = అగ్నితో; సురవైరి = రావణుని {సురవైరి - దేవతలశత్రువు, రావణుడు}; తలల్ = తలలను; కొట్టుము = పడగొట్టుము; నేలన్ = నేలమీద; పడన్ = పడిపోవునట్లు; చేపట్టుము = స్వీకరించుము; నీ = నీయొక్క; అబలన్ = స్త్రీని; అధిక = మిక్కిలి; భాగ్య = సౌభాగ్య; ప్రభలన్ = ప్రకాశములతో.

భావము:

ఓ రామ! సేతువు కట్టుము. లంకను చుట్టుముట్టుము. నీ బాణాగ్నిచేత రావణాసురుని తలలు తరుగుము. మంగళకరంగా నీ యిల్లాలిని చేపట్టుము. అని సముద్రుడు నిగ్రహింప బూనిన శ్రీరామునితో అన్నాడు.