పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కటిచేలంబు (10.1-638-మ.)

10.1-638-మ.

టిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో
స్త సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
త్కుశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్.

టీకా:

కటి = మొలనున్న; చేలంబున్ = వస్త్రమును; బిగించి = గట్టిగా కట్టి; పింఛమునన్ = నెమలి పింఛముతో; చక్కన్ = చక్కగా; కొప్పున్ = జుట్టుముడిని; బంధించి = కట్టి; దోస్తట = అరచేతులురెంటిని; సంస్ఫాలనము = చఱచుట; ఆచరించి = చేసి; చరణ = కాళ్ళు; ద్వంద్వంబున్ = రెంటిని; కీలించి = కీళ్ళువంచిబిగించి; తత్ = ఆ యొక్క; కుట = చెట్టు; శాఖా = కొమ్మ; అగ్రము = కొన; మీద = పై; నుండి = నుండి; ఉఱికెన్ = దుమికెను; గోపాల = గొల్లవాడైన; సింహంబు = అతి పరాక్రమవంతుడు; దిక్తటముల్ = దిగ్భాగములు; మ్రోయన్ = మారుమోగిపోవునట్లు; హ్రదంబు = మడుగు; లోన్ = లోనికి; గుబగుబ = గుబగుబ అనెడి; ధ్వానంబు = శబ్దములు; అనూనంబు = అధికముగ; కన్ = కలుగునట్లు.

భావము:

కాళిందీ మర్దనం చేయటానికి సిద్ధం అవుతున్న కృష్ణబాలుడు, -

నడుముకున్న దట్టీగుడ్డని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. తలవెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు చరచాడు. రెండుకాళ్ళు కీళ్ళు బిగించి సింహపరాక్రమశాలి గోపాలబాలుడు ఆ చెట్టు కొమ్మ మీదనుంచి కాళింది మడుగులోకి కుప్పించి దూకాడు. దూకిన వేగానికి గుభీలు మని పెద్ద శబ్దం వచ్చింది. దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి.