పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కరుణాకర (6-530-తో.)

6-530-తో.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణాకర! శ్రీకర! కంబుకరా!
ణాగతసంగతజాడ్యహరా!
రిరక్షితశిక్షితక్తమురా!
రిరాజశుభప్రద! కాంతిధరా!

టీకా:

కరుణాకర = నారాయణ {కరుణాకరుడు - దయామయుడు, విష్ణువు}; శ్రీకర = నారాయణ {శ్రీకరుడు -శుభములను కలిగించెడివాడు, విష్ణువు}; కంబుకరా = నారాయణ {కంబుకరుడు - కంబు (పాంచజన్యము యనెడి శంఖమును) కరుడు (చేత ధరించెడివాడు), విష్ణువు}; శరణాగత సంగత జాడ్యహరా = నారాయణ {శరణాగత సంగత జాడ్యహరుడు - శరణ (శరణని) ఆగత (వచ్చినవారికి) సంగత (కలిగిన) జాడ్య (కష్టములను) హరుడు (నశింపజేసెడివాడు), విష్ణువు}; పరిరక్షిత శిక్షిత భక్త మురా = నారాయణ {పరిరక్షిత శిక్షిత భక్త మురా - పరిరక్షిత(చక్కగా కాపాడ బడెడి) శిక్షిత (శిక్షింప బడిన) భక్త (భక్తులు) ముర (మురాసుర ఆదులు) గల వాడు,, విష్ణువు}; కరిరాజ శుభ ప్రద = నారాయణ {కరిరాజ శుభ ప్రదుడు - కరిరాజు (గజేంద్రుని)కి శుభ (శుభములు) ప్రదుడు (ఇచ్చెడివాడు), విష్ణువు}; కాంతిధరా = నారాయణ {కాంతిధరుడు - కాంతి (ప్రకాశమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు}.

భావము:

కరుణకు ఆలవాలమైన వాడా! సంపదలను సమకూర్చే వాడ!శరణు జొచ్చిన భక్తుల కష్టాలు కడతేర్చెడి వాడా! ఆర్తులను కాపాడి మురాసుర ఆదులను సంహరించిన వాడా! గజరాజుకి మేలు ప్రసాదించిన వాడా!కాంతి మయ స్వరూపా! ప్రణామములు,

తెలుగు భాగవత గ్రంథంలో సంస్కృత ఛందోబద్దమైన శ్లోకాన్ని ఒకమారే వాడారు. అది నారయ కృతి అయిన షష్ఠ స్కంధంలో ఆ శ్లోకం ఇదే...