పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కరిఁ దిగుచు (8-54-క.)

8-54-క.

రిఁ దిగుచు మకరి సరసికిఁ
రి దరికిని మకరిఁ దిగుచు రకరి బెరయన్
రికి మకరి మకరికిఁ గరి
మనుచును నతల కుతల టు లరుదు పడన్.

టీకా:

కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసి = మడుగులోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరి = ఒడ్డున; కిని = కి; మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = శౌర్యము; పెరయన్ = అతిశయించగా; కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భరము = భారమైనది; అనుచున్ = అంటూ; అతల = అతలలోకపు; కుతల = కుతలలోక; భటుల్ = వీరులు; అరుదు = ఆశ్చర్య; పడన్ = పడగా.

భావము:

గజేంద్రుణ్ణి మొసలి మడుగులోకి లాగింది. ఆ మొసలిని ఏనుగుల రాజు గట్టుపైకి ఈడ్చింది. రెండూ ద్వేషాన్ని పెంచుకున్నాయి, "ఏనుగు కంటె మొసలి బలమైనది" అని, "మొసలి కంటె ఏనుగు బలమైంది.” అని అనుకుంటు అతల కుతల లోకాల వీరులు ఆశ్చర్యపడ్డారు.