పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కనింయెం దాపసపుంగవుం (3-148-మ.)

3-148-మ.

నియెం దాపసపుంగవుం డఖిలలోఖ్యాతవర్ధిష్ణు శో
భాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు యోగీంద్రహృ
ద్వజాతైకచరిష్ణు కౌస్తుభముఖోద్యద్భూషణాలంకరి
ష్ణు నిలింపాహితజిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్.

టీకా:

కనియెన్ = దర్శించెను; తాపసపుంగవుడు = మైత్రేయుడు {తాపసపుంగవుడు - తాపసులలో శ్రేష్టుడు, మైత్రేయుడు}; అఖిలలోకఖ్యాతవర్థిష్ణున్ = కృష్ణుని {అఖిలలోకఖ్యాతవర్థిష్ణుడు - సమస్త లోకస్థులచే కీర్తింపబడి అతిశయించు శీలము కలవాడు, విష్ణువు}; శోభనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు = కృష్ణుని {శోభనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు -శుభకరమై ప్రకాశిస్తున్న నిండుజవ్వనముయొక్కశోభచేప్రకాశించువాడు, విష్ణువు}; యోగీంద్రహృద్వనజాతైకచరిష్ణు = కృష్ణుని {యోగీంద్రహృద్వనజాతైకచరిష్ణు 

- యోగులలోశ్రేష్టులైనవారి హృదయపద్మములందు ఒకడై చరించువాడు}; కౌస్తుభముఖోద్యద్భూషణాలంకరిష్ణు = కృష్ణుని {కౌస్తుభముఖోద్యద్భూషణాలంకరిష్ణు - కౌస్తుభము మొదలగు ముఖ్యమైన మిక్కిలి ప్రకాశిస్తున్న భూషణములచే అలంకరింపబడినవాడు}; నిలింపాహితజిష్ణు = కృష్ణుని {నిలింపాహితజిష్ణు - నిలంప (దేవతల)కు అహిత (శత్రువులు) అగు రాక్షసులను జయించు శీలము కలవాడు, విష్ణువు}; విష్ణున్ = కృష్ణుని {విష్ణువు - ప్రకాశించువాడు, హరి}; ప్రభవిష్ణున్ = కృష్ణుని {ప్రభవిష్ణుడు - సృష్టిగా పుట్టుకువచ్చే స్వభావము కలవాడు, విష్ణువు}; రోచిష్ణున్ = కృష్ణుని {రోచిష్ణుడు - ప్రకాశించు స్వభావము కలవాడు}.

భావము:

అలా వచ్చిన మునిశ్రేష్ఠుడు మైత్రేయుడు విశ్వమంతా విస్తరిల్లిన శాశ్వతకీర్తితో, సౌభాగ్యశోభల వైభవంతో కూడినవాడు, సంపూర్ణ యౌవన స్పూర్తితో విరాజిల్లేవాడు, మహా యోగీంద్రుల హృదయపద్మాలలో సంచరించేవాడు, కౌస్తుభం మొదలైన తళతళలాడే ఆభరణాలు అలంకరించుకొనువాడు, సర్వవ్యాపకుడు, సర్వ సమర్థుడు, తేజోమయుడు, రాక్షసులను జయించు శీలము కలవాడు అయిన శ్రీకృష్ణుని దర్శించాడు.