పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కల్లలేదని (10.1-1769-మత్త.)

10.1-1769-మత్త.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లలేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే
ల్లుఁడయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా
ల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదు రీశ్వరా!"

టీకా:

కల్ల = తప్పు; లేదు = చేయలేదు; అని = అని; విన్నవించుట = చెప్పుట; కాదు = లేదు; వల్లభ = ప్రియమైనవాడ; ఈతనిన్ = అతనిని; ప్రల్లదున్ = దుష్టుడను; తెగజూచితేనియున్ = చంపబోయితివేని; భాగ్యవంతులము = అదృష్టవంతులము; ఐతిమి = అయినాము; మేము = మేము; అల్లుండు = అల్లుడు {అల్లుడు - కూతురు భర్త}; అయ్యెన్ = అయ్యెను; ముకుందుడు = మోక్షమునిచ్చువాడు; ఈశ్వరుడు = ఐశ్వర్యవంతుడు, కృష్ణుడు; అంచున్ = అని; మోదితుల = సంతోషించినవారు; ఐన = అయిన; మా = మా యొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; పుత్ర = కొడుకుమరణించిన; శోకమున్ = దుఃఖమును; తాల్చి = పొంది; చిక్కుదురు = కృశింతురు; ఈశ్వరా = స్వామీ.

భావము:

ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో పొగిలిపోతారు నాథా!" 

రుక్మిణీ పాణిగ్రహణం చేసి, స్వయంవరానికి వచ్చిన శ్రీకృష్ణు తీసుకెళ్తున్నాడు. రుక్మి దురాగ్రహంతో అడ్డుతగిలాడు. తన అన్నను శిక్షించవద్దని కృష్ణునికి రుక్మిణి విన్నవించుకుంటోంది. ఎంత సమయస్పూర్తి, ఎంత వివేకం, ఎంత వినయం రాకుమారికి.