పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కాళికి (6-7-క.)

6-7-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాళికి బహుసన్నుత లో
కాళికిఁ గమనీయ వలయ రకీలిత కం
కాళికిఁ దాపస మానస
కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్.

టీకా:

కాళి = పార్వతీదేవి; కిన్ = కి; బహుసన్నుతలోకాళి = పార్వతీదేవి {బహుసన్నుతలోకాళి - బహు (అనేకమైన) సన్నుత (స్తుతించెడి) లోక (లోకముల) ఆళి (సమూహములుగలామె), పార్వతి}; కిన్ = కు; కమనీయ వలయ కరకీలిత కంకాళి = పార్వతీదేవి {కమనీయవలయకరకీలితకంకాళి - కమనీయ (మనోహరమైన) వలయ (కంకణములు) కర (చేతులందు) కీలిత (అలంకరింపబడిన) కంక (పుర్రెల) ఆళి (సమూహములుగలామె), పార్వతి}; కిన్ = కి; తాపసమానసకేళి = పార్వతీదేవి {తాపసమానసకేళి - తాపసుల మానస (మనసులందు) కేళి (విహరించెడియామె), పార్వతి}; వందనము = నమస్కారము; చేసి = చేసి; కీర్తింతున్ = స్తుతింతును; మదిన్ = మనసునందు.

భావము:

లోకాలన్నీ సాగిల పడి మొక్కే అమ్మ, కమనీయ కనకకంకాణాలు ధరించిన చేతులలో కపాలం ధరించే తల్లి, మహామునుల మనసులలో విహరించే మాత కాళీమాతను చేతులు జోడించి ప్రస్తుతిస్తాను.
షష్ఠ స్కంధ, ఉపోద్ఘాతంలో సింగయ వారు చేసిన దుర్గస్తుతి.