పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కళలుగలుగుగాక (10.1-1292-ఆ.)

10.1-1292-ఆ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళలు గలుగుఁ గాక; మల తోడగుగాక;
శివుని మౌళిమీఁదఁ జేరుఁ గాక;
న్యు నొల్లఁ దపనుఁ డైన మత్పతి యని
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.

టీకా:

కళలు = షోడశకళలు, శోభలు; కలుగుగాక = ఉంటేఉండనిమ్ము; కమల = లక్ష్మీదేవి; తోడు = తోడబుట్టువు; అగుగాక = అయితే అయ్యుండనిమ్ము; శివుని = పరమేశ్వరుని; మౌళి = శిఖ; మీదన్ = పైకి; చేరుగాక = ఎక్కిఉంటే ఉండనిమ్ము; అన్యున్ = ఇతరుని; ఒల్లన్ = అంగీకరించను; తపనుడు = తపింపజేయువాడు; ఐనన్ = అయినప్పటికి; మత్ = నా యొక్క; పతి = భర్త; అని = అనుచు; సాధ్వి = పతివ్రత; భంగిన్ = వలె; కమలజాతి = కమలములసమూహము; మొగిడెన్ = ముడుచుకొనెను.

భావము:

చంద్రుడు కళలు కలవాడు అయితే అగు గాక, లక్ష్మీదేవి తోబుట్టువు అయితే అగు గాక, శివుడు నెత్తిని పెట్టుకొన్న వాడు అయితే అగు గాక, అన్యుడు అయిన చంద్రుడి పొత్తు మా కక్కర లేదు. తపింప జేసే వాడే అయినప్పటికి, మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పద్మినీజాతి ముడుచు కొంది. – ఇది మన కవి పోతన సూర్యాస్తమయ చంద్రోదయ వేళల వర్ణన.