పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కలడందురు (8-86-క.)

8-86-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁడందురు దీనుల యెడఁ
లఁడందురు పరమయోగి ణముల పాలం
లఁడందు రన్నిదిశలను
లఁడు కలం డనెడి వాఁడు లఁడో లేఁడో?

టీకా:

కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; దీనుల = ఆర్తుల; యెడన్ = వెంట; కలడు = ఉంటాడు; అందురు = అనెదరు; పరమ = అత్యుత్తమమైన; యోగి = యోగుల; గణముల = సమూహముల; పాలన్ = అందు; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; అన్ని = సర్వ; దిశలను = దిక్కులందును; కలడు = ఉన్నాడు; కలండు = ఉన్నాడు; అనెడి = అనెటటువంటి; వాడు = వాడు; కలడో = ఉన్నాడో; లేడో = లేడో.

భావము:

దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!