పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కలడంభోధి (7-274-మ.)

7-274-మ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లఁడంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
లఁ,డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ద్యోత చంద్రాత్మలం
లఁ,డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింవ్యక్తులం దంతటం
లఁ,డీశుండు గలండు, తండ్రి! వెదకంగానేల యీ యా యెడన్.

టీకా:

కలడు = ఉన్నాడు; అంభోధిన్ = సముద్రములలోను; కలండు = ఉన్నాడు; గాలిన్ = గాలిలోను; కలడు = ఉన్నాడు; ఆకాశంబునన్ = ఆకాశములోను; కుంభినిన్ = భూమియందును; కలడు = ఉన్నాడు; అగ్నిన్ = నిప్పులోను; దిశలన్ = దిక్కులన్నిటియందును; పగళ్ళన్ = దినములందును; నిశలన్ = రాత్రులయందును; ఖద్యోత = సూర్యుని {ఖద్యోతము - ఖత్ (ఆకాశమున) జ్యోతము (ప్రకాశించునది), సూర్యుడు}; చంద్ర = చంద్రుని; ఆత్మలన్ = ఆత్మలందు; కలడు = ఉన్నాడు; ఓంకారమునన్ = ఓంకారమునందును; త్రిమూర్తులన్ = త్రిమూర్తులందును {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2 విష్ణు 3మహేశ్వరులు}; త్రిలింగ = స్త్రీ పురుష నపుంసక {త్రిలింగములు - 1స్త్రీలింగము 2పుల్లింగము 3నపుంసకలింగము}; వ్యక్తులన్ = జాతులవారి; అందున్ = అందు; అంతటన్ = అంతటను; కలడు = ఉనాడు; ఈశుండు = భగవంతుడు {ఈశుడు - నైజముచేతనే ఐశ్వర్యములుగలవాడు, విష్ణువు}; కలండు = ఉన్నాడు; తండ్రి = తండ్రీ; వెదుకంగన్ = అన్వేషించుట; ఏల = ఎందుకు; ఈయాయెడన్ = ఇక్కడా అక్కడా.

భావము:

నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!
భగవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని కోపంగా నిలదీస్తున్న తండ్రి హిరణ్యకశిపునకు, పుత్రుడు ప్రహ్లాదుడు కలడు కలడు అంటూ ఈ మత్తే్భ విక్రీడితం చెప్తుంటే, రాక్షసుడికి ఏనుగులు ఎక్కి తొక్కుతున్నట్లు కలవరపాటు పెరుగుతోంది.