పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : జనవర ఋషభుని (5.1-65-క.)

  •  
  •  
  •  

5.1-65-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వర ఋషభుని రాజ్యం
బునైహిక ఫలముఁ గోరు పురుషుని నొకనిం
నుఁగొన నెఱుంగ మెన్నఁడు
నితేజుం డతనిమహిమ లేమని చెప్పన్.

టీకా:

జనవర = రాజ; ఋషభుని = ఋషభుని; రాజ్యంబునన్ = రాజ్యములో; ఐహిక = ఇహలోకపు; ఫలమున్ = ఫలితములను; కోరు = కోరెడి; పురుషునిన్ = మానవుని; ఒకనిన్ = ఒక్కనినైన; కనుగొన = చూడగలుగుట; ఎఱుంగము = తెలియము; ఎన్నడున్ = ఎప్పుడును; ఇన = సూర్యునితో సమానమైన; తేజుండు = తేజస్సుగలవాడు; అతని = అతని యొక్క; మహిమల్ = గొప్పదనములు; ఏమని = ఏమని; చెప్పన్ = చెప్పను.

భావము:

మహారాజా! ఆ ఋషభుడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలు ఏమని వర్ణించను? అతని రాజ్యంలో పారలౌకిక ఫలాన్ని కోరే వాళ్ళే తప్ప ఇహలోక ఫలాన్ని కోరేవాడు ఒక్కడు కనబడడు.
ఋషభచక్రవర్తి రాజ్యపాలన యందు ప్రజలలో పరిఢవిల్లిన ధార్మిక నైతి విలువలను శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి ఇలా వివరించారు.