పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : జలరాశి (1-52-క)

  •  
  •  
  •  

1-52-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాశి దాఁటఁ గోరెడి
ము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం
లిదోష హరణ వాంఛా
లితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!

టీకా:

జలరాశిన్ = సముద్రము; దాఁటన్ = దాటుటను; కోరెడి = కోరే; కలము = ఓడలోని; జనుల్ = జనము; కర్ణధారున్ = చుక్కాని పట్టి నడిపే వానిని {కర్ణధారుడు - పడవ నడుపువాడు - తరింప సమర్థుడు}; కాంచిన = చూచిన; భంగిన్ = విదంగా; కలి = కలికాలపు; దోష = పాపాలు; హరణ = నాశనము చేసే; వాంఛా = కోరికతో; కలితులము = కూడిన వారము; అగు = అయినటువంటి; మేము = మేము; నిన్నున్ = నిన్ను {నిన్ను - కలిదోషనివారకసమర్థుడైనవాని}; కంటిమి = కనుగొన గలిగితిమి; సూతా = సూతా.

భావము:

ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు.
శౌనకాది మహర్షులు ముక్తిదాయకమైన విషయం చెప్పమని అడిగే సంద్ఱబంలోని ఆణిముత్యం ఇది. అంతటి ఆర్తిగా అడిగారు కనుక మన భాగ్యవశమున ఈ భాగవత మహా పురాణం అందుతోంది.