పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఇందీవరశ్యాము (10.2-979-సీ.)

10.2-979-సీ.

ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ;
రుణాలవాలు, భాసుకపోలుఁ
గౌస్తుభాలంకారుఁ, గామితమందారు;
సురచిరలావణ్యు, సుర శరణ్యు
ర్యక్షనిభమధ్యు, ఖిలలోకారాధ్యు;
నచక్రహస్తు, జత్ప్రశస్తు,
గకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ;
న్నగశయను, నబ్జాతనయను,

10.2-979.1-తే.

కరకుండల సద్భూషు, మంజుభాషు 
నిరుపమాకారు, దుగ్ధసావిహారు, 
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు, 
విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు.

టీకా:

ఇందీవర = నల్లకలువల వంటి; శ్యామున్ = నల్లనిఛాయకలవాడు; వందిత = నమస్కరించిన; సుత్రామున్ = ఇంద్రుడు కలవానిని; కరుణాల = దయలకు; వాలున్ = పాదు ఐనవానిని; భాసుర = ప్రకాశించునట్టి; కపోలున్ = చెక్కిళ్ళు కలవానిని; కౌస్తుభ = కౌస్తుభమణి; అలంకారున్ = అలంకారముకలవానిని; కామిత = కోరినవారికి; మందారున్ = కల్పవృక్షమైన వానిని; సు = మంచి; రుచిర = కాంతివంతమైన; లావణ్యున్ = లావణ్యము కలవానిని; సుర = దేవతలకు; శరణ్యున్ = రక్షకముగా ఉండువాడు; హర్యక్షము = సింహము {హర్యక్షము - పచ్చకన్నుల మృగము, సింహము}; నిభ = వంటి; మధ్యున్ = నడుము కలవానిని; అఖిల = సర్వ; లోకా = లోకములకు; ఆరాధ్యున్ = ఆరాధింపబడువాడు; ఘన = గొప్ప; చక్ర = చక్రమును; హస్తున్ = చేతియందు కలవానిని; జగత్ = విశ్వముచేత; ప్రశస్తున్ = స్తుతింపబడువానిని; ఖగకులాధిప = గరుడ; యాను = వాహనముగా కలవానిని; కౌశేయ = పట్టు; పరిధానున్ = బట్టలుకట్టుకొన్నవానిని; పన్నగ = ఆదిశేషునిపై; శయనున్ = పరుండువానిని; అబ్జాతనయనున్ = పద్మాక్షుని; 

మకరకుండల = మొసలికుండలములు; సత్ = చక్కటి; భూషున్ = ఆభరణములుకలవానిని; మంజు = మనోజ్ఞమైన; భాషున్ = మాట్లాడువానిని; నిరుపమ = సాటిలోని; ఆకారున్ = స్వరూపము కలవానిని; దుగ్దసాగర = పాలసముద్రము నందు; విహారున్ = మెలగువానిని; భూరి = గొప్పవైన; గుణ = గుణములు; సాంద్రున్ = దట్టముగా కలవానిని; యదు = యదువు యొక్క; కుల = వంశము అను; అంభోధిన్ = సముద్రమునకు; చంద్రున్ = చంద్రుడైనవానిని; విష్ణున్ = సర్వవ్యాపకశీలుని; రోచిష్ణున్ = ప్రకాశించుశీలుని; జిష్ణున్ = జయించుశీలుని; సహిష్ణున్ = సహనశీలుని; కృష్ణున్ = కృష్ణుని.

భావము:

కోమలమైన నల్లకలువల వంటి శ్యామలవర్ణం కలవాడు, మహేంద్రుని చేతకూడ కీర్తింపబడు వాడు, దయామయుడు, ప్రకాశించే చెక్కిళ్ళు కలవాడు, కౌస్తుభమణిని అలంకరించు కొను వాడు, కోరు వారలకు కల్పవృక్షం వంటి వాడు, మంచి ప్రకాశవంతమైన లావణ్యము కల వాడు, అనిమిషులకే అండ యైన వాడు, సింహము వంటి నడుము కల వాడు, లోకాలు సమస్తము చేత పూజింపబడు వాడు, చక్రము ఆయుధముగ కల వాడు, విశ్వ మంతా విఖ్యాతి కల వాడు, గరుడుని వాహనముగ కలవాడు, పీతాంబరములు ధరించువాడు, ఆదిశేషునిపై శయనించు వాడు, కమలాల వంటి కన్నులు కలవాడు, మకరకుండలాలు ధరించువాడు, మధురంగా మాట్లాడు వాడు, సాటిలేని సౌందర్యము కల వాడు, పాలసముద్రంలో విహరించు వాడు, గొప్ప సుగుణములు సాంద్రముగ కల వాడు, యాదవకుల మనే సముద్రానికి చంద్రుడు వంటి వాడు, సాక్షాత్తు విష్ణుమూర్తి, ప్రకాశించే స్వభావం కలవాడు, జయించే శీలము కల వాడు, సహన శీలుడు అయిన శ్రీకృష్ణుని కుచేలుడు దర్శించాడు.