పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : గురువులు ప్రియశిష్యులకు (1-42-క.)

  •  
  •  
  •  

1-42-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురువులు ప్రియశిష్యులకుం
మ రహస్యములు దెలియఁ లుకుదు రచల
స్థికల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.

టీకా:

గురువులు = గురువులు; ప్రియ = ప్రియమైన; శిష్యుల = శిష్యుల; కున్ = కు; పరమ = ఉత్కృష్టమైన; రహస్యములు = రహస్య జ్ఞానములను; తెలియన్ = తెలియునట్లు; పలుకుదురు = వివరిస్తారు; అచల = చాంచల్యము లేనిది; స్థిర = స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు = శుభకరమైనది; ఎయ్యది = ఏదో; పురుషుల = మానవుల; కును = కు; నిశ్చయించి = నిర్ణయించి; బోధింపు = భోధింపుము (మాకు); తగన్ = తగినట్లుగా.

భావము:

గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.
శౌనకాది మహర్షులు అడిగినదానికి సమాధానంగా సూత మహర్షి, మహా భాగవతాన్ని, శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పిన విధానంలో, వివరంగా తెలియజెప్పారు. ఆ సందర్భంలోని మధురమైనది ఈ పద్యం. మంచి తెలుసుకోవాలంటే ఎలా అడగాలో కథానుక్రమంలో హృద్యంగా చెప్ప బడింది. ఇక్కడ చెప్పేవారు, వినేవారు ఇద్దరూ మహర్షులే అయినా ప్రశ్నించే సమయంలో ఎదుటివారిని గురుభావంతో స్వీకరించి సవినయంగా ప్రశ్నించి ప్రయోజనం పొందాలి అన్నది భాగవత జీవిత విధానం.