పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : గుఱ్ఱము గొనిపో (9-215-క.)

  •  
  •  
  •  

9-215-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుఱ్ఱముఁ గొనిపో బుద్ధుల
కుఱ్ఱఁడ! మీ తాతయొద్దకున్నీతండ్రుల్
వెఱ్ఱులు నీఱై రదె! యీ
మిఱ్ఱున గంగాజలంబు మెలఁగ శుభమగున్.

టీకా:

గుఱ్ఱమున్ = గుర్రమును; కొనిపో = తీసుకుపో; బుద్దుల = మంచిబుద్దులగల; కుఱ్ఱడ = పిల్లవాడ; మీ = మీయొక్క; తాత = పితామహుని; ఒద్ద = దగ్గర; కున్ = కి; నీ = నీ యొక్క; తండ్రులు = తండ్రులు; వెఱ్ఱులు = తెలివితక్కువారు; నీఱు = బూడిద; ఐరి = అయిపొయారు; అదె = అదిగో; ఈ = ఈ; మిఱ్రునన్ = దిబ్బమీదకి; గంగాజలంబున్ = గంగాజలమును; మెలగన్ = ప్రవహింపజేసినచో; శుభము = మంచి; అగును = జరుగును.

భావము:

ఓ బుద్ధిమంతుడైన కుర్రాడ! ఈ గుర్రాన్ని మీ తాత వద్దకి తీసుకుపో. నీ తండ్రులు తెలివితక్కువవారై బూడిద అయిపోయారు అదిగో. ఆ దిబ్బ మీదకి గంగాజలం ప్రవహిస్తే శుభం కలుగుతుంది.
సగర మహారాజు కొడుకులు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, కపిలమహర్షి ఆశ్రమంలో కాలి బూడిదయ్యారు. ఆ సాగరుని మనుమడు అంశుమంతుడు కపిలుని వినయంతో మెప్పించాడు. మహర్షి యాగాశ్వాన్ని ఇచ్చి గంగను ఈ బూడిదలపై ప్రవహింప జెయ్యి మీ తండ్రులు ఉత్తమగతి పొందుతారు అని చెప్పాడు. ఆ పని ఆ అంశుమంతుని మనవడు భగీరథుడు భారీ ప్రయత్నంతో సాధ్యం సుసంపన్నం చేశాడు. ఆయన పేరుననే గంగను భాగీరథి అంటారు.