పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : దీనుల కుయ్యాలింపను (8-133-క)

8-133-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీనుల కుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవనఁ బొందన్
దీనావన! నీ కొప్పును.
దీపరాధీన! దేవదేవ! మహేశా!

టీకా:

దీనుల = దీనుల; కుయ్యి = మొర; ఆలింపను = వినుటకు; దీనులన్ = దీనులను; రక్షింపన్ = కాపాడుటకు; మేలు = మంచి; దీవెనన్ = దీవనలను; పొందన్ = అందుకొనుటకు; దీన = దీనులను; అవన = కాపాడువాడ; నీ = నీ; కున్ = కు; ఒప్పున్ = తగియున్నవి; దీన = దీనులకు; పరాధీన = వశమైనవాడ; దేవదేవ = హరి; మహేశ = హరి.

భావము:

ఓ దేవాధిదేవ! ఓ మహాప్రభూ! దీనుల మొరలను దయతో వినటానికైనా, వారిని కాపాడటానికైనా, మంచి మంచి దీవెనకోలు అందుకోటానికైనా, దీనబంధు! దీనరక్షక! నీకే తగు నయ్యా.