పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : డింభక (7-279-క)

  •  
  •  
  •  

7-279-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"డింక సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు నుచు మిగుల సం
రంభంబునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁ గలవె క్రిన్ గిక్రిన్.

టీకా:

డింభక = కుర్రవాడా; సర్వ = ఎల్ల; స్థలములన్ = ప్రదేశములందును; అంభోరుహనేత్రుండు = హరి {అంభోరుహనేత్రుడు - అంభోరుహ (పద్మముల) వంటి నేత్రుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; ఉండున్ = ఉంటాడు; అనుచున్ = అనుచు; మిగులన్ = మిక్కలి; సంరంభంబునన్ = ఆటోపముతో; పలికెదవు = చెప్పెదవు; ఈ = ఈ; స్తంభంబునన్ = స్తంభమునందు; చూపగలవె = చూపించగలవా; చక్రిన్ = విష్ణుని; గిక్రిన్ = గిక్రిని (చక్రికి ఎగతాళిరూపము).

భావము:

ఓరి పెంకిపిల్లాడా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి.
అంటూ దేవతల శత్రువైన హిరణ్యకశిపుడు పుత్రరత్నమూ, పరమ భాగవతోత్తముడూ అయిన ప్రహ్లాదుని దబాయిస్తున్నాడు చూడండి.