పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : దళదరవింద (3-922-సీ.)

3-922-సీ.

ళ దరవింద సుంర పత్రరుచిరాక్షు;
లలిత శ్రీవత్సలితవక్షు
నీలనీరద నీలనీలోత్పలశ్యాము;
లికులాకుల మాలికాభిరాముఁ
గౌస్తుభకలిత ముక్తాహారయుతకంఠు;
యోగిమానస పంకజోపకంఠు
తప్రసన్నసస్మివదనాంభోజు;
దినకరకోటి సందీప్తతేజు

3-922.1-తే.

లలితానర్ఘ్య రత్న కుంల కిరీట
హాకంకణ కటక కేయూముద్రి
కాతులాకోటి భూషు భక్తప్రపోషుఁ
గింకిణీయుత మేఖలాకీర్ణజఘను.

టీకా:

సలలితానర్ఘ్యరత్నకుండలకిరీటహారకంకణకటకకేయూరముద్రికాతులాకోటిభూషున్ = విష్ణుమూర్తిని {సలలితానర్ఘ్య రత్నకుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రికా తులాకోటి భూషుడు - సలలితా (అంద దళదరవిందసుందరపత్రరుచిరాక్షున్ = విష్ణుమూర్తిని {దళదరవిందసుందరపత్రరుచిరాక్షుడు - దళత్ (విచ్చుకొనుచున్న) అరవింద (పద్మముల) సుందర (అందమైన) పత్ర (రేకుల వంటి) రుచిర( ప్రకాశమైన) అక్షుడు (కన్నులు కలవాడు) , విష్ణువు}; సలలితశ్రీవత్సకలితవక్షున్ = విష్ణుమూర్తిని {సలలితశ్రీవత్సకలితవక్షుడు - సలలిత (అందమైన) శ్రీవత్స (శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ) కలిత (కలిగిన) వక్షున్ (వక్షస్థలము కలవాడు) , విష్ణువు}; నీలనీరదనీలనీలోత్పలశ్యామున్ = విష్ణుమూర్తిని {నీలనీరదనీలనీలోత్పలశ్యాముడు - నీల (నల్లని) నీరద (మబ్బు వలెను) నీల (నల్లని) నీలోత్పల (నల్లకలువ వలెను) శ్యాముడు (నల్లగా ఉన్నవాడు) , విష్ణువు}; అలికులాకులమాలికాభిరామున్ = విష్ణుమూర్తిని {అలికులాకులమాలికాభిరాముఁడు- అలి (తుమ్మెదల) కుల (సమూహము వంటి)అలక( ముంగురుల) మాలికా (గుంపులచే) అభిరాముడు (చక్కనైన వాడు), విష్ణువు}; కౌస్తుభకలితముక్తాహారయుతకంఠున్ = విష్ణుమూర్తిని {కౌస్తుభకలితముక్తాహారయుతకంఠుడు - కౌస్తుభ (కౌస్తుభము అను మణి) కలిత (కూడిన) ముక్త (ముత్యాల) హార (హారములుతో) యుత (కూడిన) కంఠుడు (కంఠము కలవాడు), విష్ణువు}; యోగిమానసపంకజోపకంఠున్ = విష్ణుమూర్తిని {యోగిమానసపంకజోపకంఠుడు - యోగి (యోగుల) మానస (మనసులు అనెడి) పంకజ (పద్మముల) ఉపకంఠుడు (సమీపమున ఉన్నవాడు), విష్ణువు}; సతతప్రసన్నస్మితవదనాంభోజున్ = విష్ణుమూర్తిని {సతతప్రసన్నస్మితవదనాంభోజుడు - సతత (ఎల్లప్పుడును) ప్రసన్న (ప్రసన్నమైన) స్మిత (చిరునవ్వుతో కూడిన) వదన (మోము అనెడి) అంభోజున్ (పద్మము కలవాడు), విష్ణువు}; దినకరకోటిసందీప్తతేజున్ = విష్ణుమూర్తిని {దినకరకోటిసందీప్తతేజుడు - దినకర (సూర్యులు) కోటి (కోటి మందితో సమానమైన) సందీప్తుడు (ప్రకాశము కలవాడు), విష్ణువు};
మైన) అనర్ఘ్య (వేలకట్టలేని) రత్నములు తాపిన కుండలములు కిరీటములు హారములు కంకణములు కటక (కడియము)లు కేయూర (భుజకీర్తులు) ముద్రికా (ఉంగరములు) తులాకోటి (అందెలు) లతో భూషితుడు (అలంకరింపబడినవాడు), విష్ణువు}; భక్తప్రపోషున్ = విష్ణుమూర్తిని {భక్తప్రపోషుడు - భక్తులను చక్కగా పోషించువాడు, విష్ణువు}; కింకిణీయుతమేఖలాకీర్ణజఘనున్ = విష్ణుమూర్తిని {కింకిణీయుతమేఖలాకీర్ణజఘనుడు - కంకిణీ (గజ్జలు) యుత (కలిగిన) మేఖలా (వడ్డాణము) తో ఆకీర్ణ (కూడిన) జఘనుడు (నడుము కలవాడు)};

భావము:

శ్రీమన్నారాయణుడు అప్పుడే వికసిస్తున్న అరవింద పూల తాజా పూరేకుల వంటి అందమైన కన్నులు కలవాడు; సొగసైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలమున ఉన్నవాడు; నీలిమేఘంలా, నల్లకలువలా శ్యామలఛాయ వాడు; తుమ్మెదలకు కనువిందుచేసే వైజయంతికామాలికతో విరాజిల్లేవాడు; కౌస్తుభమణితో శోభించే ముత్యాల హారం కంఠమున ధరించిన వాడు; యోగీశ్వరుల హృదయకమలాలకు దగ్గరైనవాడు; విలువైన రమణీయమైన రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, ఉంగరాలు, అందెలు మొదలైన సకల అలంకారాలతో విలసిల్లేవాడు; కటిప్రదేశము నందు ఘల్లు ఘల్లు మనే గజ్జెల మొలతాడు కట్టుకుని విరాజిల్లేవాడు.
విష్ణు సర్వాంగస్తోత్రంలోని మహా మంత్ర పూరితమైన అమృతధార యిది.