పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : చుంచొదువు (7-254-క.)

10.1-419-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చుంచొదువుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదువ దనుచు లీలా
చుంచుండై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!

టీకా:

చుంచు = పిలక, బలము, నేర్పరితనం {నేర్పరి- చుంచుప్ ప్రత్యయం (" తేనవిత్తః చుంచుప్ చణపౌ" అనికౌముదీ సూత్రం)}; ఒదవున్ = బాగగును, కలుగును; పాలున్ = పాలను; త్రావుము = తాగుము; ఉదంచితముగన్ = చక్కగా; అనుడున్ = అనిచెప్పగా; పాలున్ = పాలను; త్రావి = తాగి; జనని = తల్లి; తోన్ = తోటి; చుంచు = జుట్టు, బలము; ఒదవదు = పెరగలేదు; అనుచు = అంటూ; లీలాచుంచుండు = లీలలందుఆసక్తికలవాడు; ఐ = అయ్యి; అతడు = అతను; చుంచున్ = పిలకను; చూపెన్ = చూపించెను; నరేంద్రా = రాజా.

భావము:

ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం ” దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా” యని అడిగాడు లీలలుచూపుటందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి.