పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : చొక్కపు రక్కసి (7-254-క.)

  •  
  •  
  •  

7-254-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చొక్కపు రక్కసికులమున
వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్."

టీకా:

చొక్కపు = స్వచ్ఛమైన; రక్కసి = రాక్షస; కులమున = వంశమున; వెక్కురు = వెఱ్ఱివాడు; జన్మించినాడు = పుట్టినాడు; విష్ణుని = హరి; అందున్ = ఎడల; నిక్కపు = సత్యమైన; మక్కువ = ప్రీతి; విడువండు = వదలుడు; ఎక్కడి = ఎలాంటి; సుతున్ = పుత్రుని; కంటి = పుట్టింటితివి; రాక్షసేశ్వరా = రాక్షసరాజా; వెఱ్ఱిన్ = వెర్రివాడిని.

భావము:

స్వచ్చమైన రాక్షస వంశంలో వికృతమైనవాడు పుట్టాడు. ఎంత చెప్పిన విష్ణువుమీద మమత వదలడు. ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా హిరణ్యకశిపమహారాజ!