పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : చెప్ప డొక చదువు

  •  
  •  
  •  

7-210-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చెప్పఁ డొక చదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగాఁ
జెప్పెడు మన యెడ నొజ్జలు
చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్."

టీకా:

చెప్పడు = తెలుపడు; ఒక = ఒక; చదువు = శాస్త్రము; మంచిది = మంచిది; చెప్పెడిన్ = చెప్పును; తగులములు = సాంసారిక బంధనములను; చెవులు = చెవులు; చిందఱగొనగాన్ = చెదిరిపోవునట్లు; చెప్పెడు = చెప్పును; మన = మన; ఎడన్ = అందు; ఒజ్జలు = గురువులు; చెప్పెదన్ = తెలిపెదను; ఒక = ఒకటి; చదువు = విద్యని; వినుడు = వినండి; చిత్తముల్ = మనసులు; అలరన్ = సంతోషించునట్లుగ.

భావము:

“ఓ స్నేహితులారా! మన గురువులు మన కెప్పుడు ఒక్క మంచి చదువు కూడ చెప్పటం లేదు కదా! ఎప్పుడు చూసినా చెవులు చిల్లులు పడేలా సంసార భోగ విషయాలైన కర్మబంధాలను గూర్చి చెప్తున్నారు. మీ మనసుకు నచ్చే మంచి చదువు నేను చెప్తాను. వినండి.”
ఇలా ప్రహ్లాదుడు తోటి రాక్షసకుమారులకు విష్ణుభక్తి, నివృత్తి మార్గం, నారద మతం బోధిస్తాను రమ్మంటున్నాడు. వెళ్దామా?