పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : చను నీకు గుడిపఁజాలెడి (10.1-220-క.)

10.1-220-క.

"చనునీకు గుడుపఁజాలెడి
నువారలు లేరు; నీవు నవలె" ననుచుం
నుఁగుడుపి మీఁద నిలుకడఁ
నుదాన ననంగ వేడ్కఁ నుఁ జనుఁ గుడుపన్.

టీకా:

చనున్ = చనుబాలను; నీ = నీ; కున్ = కు; కుడుపన్ = తాగించుటకు; చాలెడు = సమర్థులైన; చనువారలు = తగినవారు; లేరు = ఎవరూలేరు; నీవు = నీవు; చనవలెన్ = వెళ్ళవలెను, చావవలెను; అనుచున్ = అనుచు; చను = చనుబాలు; కుడిపి = తాగించి; మీదన్ = ఆపైన; నిలుకడన్ = నెమ్మదిగా; చనుదానన్ = వెళ్ళెదను; అనగన్ = అనెడి; వేడ్కన్ = కుతూహలముతో; చనున్ = వెళ్ళును; చను = చనుబాలు; కుడుపన్ = తాగించుటకు.

భావము:

బాలకృష్ణుని వద్దకు వస్తున్న శిశుహంతకి పూతన 

 “నీకు చను (బాలు/ట) పట్టించ గల నేర్పరులు ఎవరు లేరయ్య. ఇంక నువ్వు పోవాలి.” అని లాలించింది. నీకు చను (బాలు/ట) పట్టించి అటుపిమ్మట మెల్లిగా (తప్పక) పోతాలే అంటున్నట్లు ఉత్సాహంతో స్తన్యం ఇవ్వడానికి బయలుదేరింది.