పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : చంద నాదుల (1-279-తే.)

1-279-తే.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు
నివి నొందని కైవడి ర్మసుతుఁడు
సంపదలు పెక్కు గలిగియుఁ క్రిపాద
సేవనంబులఁ పరిపూర్తి సెందకుండె.

టీకా:

చందన = మంచిగంధం; ఆదులన్ = మొదలగు వాని వలన; ఆఁకటన్ = ఆకలితో; స్రగ్గువాఁడు = కుంచించుకొని పోవు వాడు; తనివిన్ = సంతృప్తిని; ఒందని = పొందని; కైవడిన్ = విధముగ; ధర్మసుతుఁడు = ధర్మరాజు {ధర్మసుతుఁడు – యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; సంపదలు = సంపదలు; పెక్కున్ = చాలా; కలిగియున్ = కలిగి ఉన్నప్పటికిని; చక్రి = చక్రాయుధుని / హరి{చక్రి – చక్రము ఆయుధముగా గల వాడు, కృష్ణుని }; పాద = పాదములను; సేవనంబులన్ = కొలచుట యందు; పరిపూర్తి = సంతృప్తి; చెందకన్ = చెందకుండగ; ఉండెన్ = ఉండెను.

భావము:

మంచి గంధం లాంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని ఉన్నా ఆకలితో అల్లాడే వాడు తిండి కోసం ఎంతో ఆతృతతో ఉంటాడు. అలాగే కౌరవులను ఓడించి ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందాక కూడ, శ్రీకృష్ణ భగవానుని ఎంత సేవిస్తున్నా, ఇంకా సేవించాలని ఎంతో ఆతృత కలిగి ఉన్నాడుట.