పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : అలసులు (1-44-చ)

1-44-చ.

సులు మందబుద్ధియుతు ల్పతరాయువు లుగ్రరోగసం
లితులు మందభాగ్యులు సుర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
లియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
వడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.

టీకా:

అలసులు = సోమరి పోతులు; మంద = మందగించిన; బుద్ది = బుద్ది; యుతులు = కలిగినవారు; అల్పతర = చాలా తక్కువ {అల్ప - అల్పతర - అల్పతమ}; ఆయువులు = ఆయుష్షు కలవారు; ఉగ్ర = భయంకరమైన; రోగ = రోగములతో; సంకలితులు = కూడిన ఉన్న వారు; మంద = మందగించిన; భాగ్యులు = భాగ్యము కలవారు; సుకర్మములు = మంచిపనులు; ఎవ్వియున్ = ఏవియును; చేయఁజాలరు = చేయలేరు; ఈ = ఈ; కలియుగమందు = కలియుగము; అందున్ = లో; మానవులు = మనుషులు; కావునన్ = అందువలన; ఎయ్యది = ఏదైతే; సర్వ = అన్ని; సౌఖ్యము = సుఖములను కలుగజేయునది; ఐ = అయ్యి; అలవడున్ = సిద్ధించునో; ఏమిటన్ = దేనివలన; పొడమున్ = కలుగుతుందో; ఆత్మకు = ఆత్మకు; శాంతి = శాంతి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్టుడా; చెప్పవే = చెప్పుము.

భావము:

మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులు వాళ్ళని పట్టి పల్లారుస్తున్నాయి. వాళ్ళు సత్కార్యా లేవైనా చేయటానికి అసమర్థు లౌతున్నారు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు.