పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఆదిదేవుడైన (23-359-ఆ)

23-359-ఆ.

దిదేవుఁడైన యారామచంద్రుని
బ్ధి గట్టు టెంత సురకోటి
జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత
సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.

టీకా:

ఆదిదేవుడు = మూలాధారదేవుడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; రామచంద్రుని = రామచంద్రుని; కిన్ = కి; అబ్ధి = సముద్రమునకు; కట్టుట = సేతువుకట్టుట; ఎంత = ఎంతపాటిపని; అసుర = రాక్షస; కోటి = సమూహమును; చంపుట = సంహరించుట; ఎంత = అది ఎంతపని; కపుల = వానరుల; సాహాయ్యము = తోడు; అది = అది; ఎంత = ఎంతటిది; సురల = దేవతల; కొఱకున్ = కోసము; క్రీడ = లీలలు; చూపెన్ = చూపించెను; కాక = తప్పించి.

భావము:

ఆ పురాణ పురుషుడు అయినట్టి శ్రీరామచంద్రుడు తలచుకుంటే సముద్రంమీద సేతువు కట్టడం, రాక్షసులు అందరిని చంపడం లాంటివి ఏమాత్రం పెద్ద పనులేం కావు కాని, దేవతల కోసం తన లీలలను ప్రదర్శించాడంతే.