పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : గర్భమందు (1-182-ఆ.)

1-182-ఆ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్భ మందుఁ గమలర్భాండశతములు
నిముడుకొన వహించు నీశ్వరేశ!
నీకు నొక్క మానినీగర్భరక్షణ
మెంత బరువు నిర్వహింతు గాక."

టీకా:

గర్భమందున్ = గర్భంలోపల; కమలగర్భఅండ = బ్రహ్మాండములు; శతములు = వందలకొలది; నిముడుకొనన్ = ఇముడ్చుకొని; వహించు = ధరించు; ఈశ్వర = దేవతలలో; ఈశ = శ్రేష్ఠుడా; నీకు = నీకు; ఒక్క = ఒక్క; మానినీ = స్త్రీ యొక్క; గర్భ = గర్భాన్ని; రక్షణము = రక్షించటం; ఎంత = ఏపాటి; బరువు = భారము; నిర్వహింతుగాక = తప్పక చేయ్యి (నాగర్భరక్షణ).

భావము:

గర్భంలో వందలకొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే దేవాధిదేవ! శ్రీకృష్ణా! నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవయ్యా! నా గర్భాన్ని రక్షించవయ్యా!”
అండ పిండ బ్రహ్మాండం. అర్జునుడి భార్య ఉత్తర గర్భంలో అండం పిండ రూపం దాల్చింది ఇంతలో అశ్వత్థామ "అపాండవ మయ్యెడు గాక" అని వేసిన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ బాణాగ్నికి దందహ్యమాను డవుతున్న ఆ భవిష్య పరీక్షిత్తును, "బ్రహ్మాండాలు కడుపులో దాచుకునే మహాత్మా! కాపాడ వయ్యా" అని, ఆ బ్రహ్మాండ నాయకుని వర్ణిస్తూ ఉత్తర అర్థిస్తోంది