పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : అతులదివ్యాన్నమైన (5.1-128-తే.)

5.1-128-తే.

తుల దివ్యాన్నమైన మృష్టాన్నమైన
నెద్ధి వెట్టిన జిహ్వకు హితముగానె
లఁచి భక్షించుఁగా; కొండుఁ లఁచి మిగులఁ
బ్రీతి చేయఁడు రుచులందుఁ బెంపుతోడ.

టీకా:

అతుల = సాటిలేని; దివ్య = దివ్యమైన; అన్నమున్ = ఆహారము; ఐనన్ = అయినను; మృష్ట = రుచికరమైన; అన్నమున్ = ఆహారము; ఐనన్ = అయినను; ఎద్ది = ఏది; పెట్టినన్ = పెట్టినప్పటికిని; జిహ్వ = నాలుక; కున్ = కు; హితమున్ = ఇష్టము; కానె = అగునట్లు; తలచి = భావించి; భక్షించున్ = తినును; కాక = కాని; ఒండు = మరియొకవిధముగ; తలచి = భావించి; మిగులన్ = మిక్కలి; ప్రీతిచేయడు = ఇష్టపడడు; రుచులు = రుచులు; అందున్ = ఎడల; పెంపు = అతిశయము; తోడన్ = తోటి.

భావము:


లేడి పిల్ల మీద వ్యామోహంతో మరణించిన భరతుడు, మరు జన్మలో బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణుల ఇంట పుట్టాడు. అతడు ఎంతో రుచికర మైన చక్కటి అన్నం పెట్టిన, పాసిపోయిన అన్నం పెట్టిన కాదనకుండ ఒకే విధంగా స్వీకరించేవాడు. అంతే కాని ఇంకోలా చూసి రుచుల కోసం అర్రులు చాచే వాడు కాదు.