పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : అన్నులచన్నుల (10.1-802-క.)

10.1-802-క.

న్నుల చన్నుల దండ వి
న్నులు గా కెల్లవారు బ్రతికిరిగా కీ
న్నుల మీఱిన వలి నా
న్నులు గా కుండఁ దరమె బ్రహ్మాదులకున్.

టీకా:

అన్నుల = స్త్రీల యొక్క {అన్ను - పరవశింప చేయునామె, స్త్రీ}; చన్నుల = పాలిండ్ల; దండన్ = ప్రాపుచేత, అండచేత; విపన్నులు = ఆపదపొందినవారు; కాక = కాకుండగ; ఎల్ల = అందరు; వారున్ = జనులు; బ్రతికిరి = కాపాడబడిరి; కాక = తప్పించి; ఈ = ఈ యొక్క; చన్నులన్ = పాలిండ్లను; మీఱినన్ = లెక్కచేయకపోయినచో; వలిన్ = చలిచేత; ఆపన్నులు = ఆపదలుపొందినవారు; కాకుండన్ = కాకుండుట; తరమె = శక్యమా, కాదు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల = మొదలగువారల; కున్ = కు.

భావము:

ఈ హేమంత ఋతువులో పడతుల పయోధరాల చెంత ప్రజలందరు ఆపదకు లోనుగాకుండ జీవింప గలుగుతున్నారు. వాటి అండే లేకపోతే బ్రహ్మాది దేవతల కైనా చలిబాధ తట్టుకోడం సాధ్యం కాదు కదా.దశమ స్కంధలో హేమంత ఋతు వర్ణనలో ప్రయోగించిన చమత్కార పద్యమిది. అసలే హేమంత ఋతువు మరి చలి చంపేస్తుంటుంది కదా. ఆ చలిబాధ నుంచి రక్షణకి ప్రజలు అందరు తమ స్త్రీల స్తనాలని ఆశ్రయించారుట. లేకపోతే తట్టుకోలేరుట. ఆ బ్రహ్మగారి విషయం అయినా ఇంతే నట. ఋతువర్ణన ఉదయాస్తమయాల వర్ణనాదులు ప్రబంధ లక్షణాలలో ఒక నియమం. ఇలా ప్రబంధ నియమాలను పాటించిన భాగవత పురాణం ఒక నిండు ప్రబంధం రత్నం.