పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : అలవాటు (9-275-క.)

9-275-క.

వాటు కలిమి మారుతి
లితామిత లాఘవమున లంఘించెను శై
లినీగణసంబంధిన్
పూరిత ధరణి గగన సంధిం గంధిన్.

టీకా:

అలవాటు = అభ్యాసము {అలవాటుకలిమి - హనుమంతుడు బాలునిగా సూర్యుని వరకు గెంతి మింగబోయినది సూచింప పడుతున్నది}; కలిమిన్ = ఉండుటచేత; మారుతి = హనుమంతుడు {మారుతి - వాయుపుత్రుడు, హనుమంతుడు}; లలిత = సున్నితమైన; అమిత = అత్యధికమైన; లాఘవమునన్ = నేర్పుతో; లంఘించెను = దాటెను; శైవలినీ = నదుల {శైవలిని - నాచుగలది, నది}; గణ = సమూహమునకు; సంబంధిన్ = బంధువైనదానిని; జల = నీటితో; పూరిత = నిండియుండి; ధరణి = భూమిని; గగన = ఆకాశమును; సంధిన్ = కలుపుదానిని; కంధిన్ = సముద్రమును {కంధి - కం (నీటికి) నిధి, కడలి}.

భావము:

హనుమంతుడు అలవాటు ఉండటం వలన నదులకు బంధువు (చేరుగడ), భూమికి ఆకాశానికి వ్యవధానం అయ్యి నీటితో నిండి ఉండే సముద్రాన్ని చక్కటి మిక్కిలి నేర్పుతో దాటాడు. హనుమ దాటిన సముద్రం ఎంత పెద్దది అంటే నదులలోని నీళ్ళన్ని అలా వచ్చి కలుస్తోనే ఉంటాయి కదా; ఆ నీళ్ళు అన్నిటితో నిండి ఉంటుంది, భూమి ఆకాశం కలిసినట్టు కనిపించేటంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది, అంత పెద్దది; అంత పెద్ద సముద్రాన్ని రామ కార్యం కోసం అవలీలగా ఎలా దాటాడంటే; ఆంజనేయుడు చిన్నతనంలోనే సూర్యుణ్ణి పండు అనుకొని అందుకోడానికి ఎగిరాడు కదా; ఆలా దూకే అలవాటు ఉండటం వలన సీతాదేవిని వెదకటానికి వెళ్తూ సముద్రాన్ని అలవోకగా దాటాడు.