పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : అడిగెదనని (8-103-క.)

8-103-క.

డిగెద నని కడువడిఁ జను
డిగినఁ దను మగుడ నుడుగఁ ని నడ యుడుగున్
వెవెడ సిడిముడి తడఁబడ
డుగిడు; నడుగిడదు జడిమ డు గిడునెడలన్.

టీకా:

అడిగెదన్ = అడిగెదను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగినప్పటికిని; తను = అతను; మగుడ = మారుపలుకులు; నుడువుడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడవెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.

భావము:

కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి – ఎందుకు వెళ్తున్నాడో అడగాలి అని వేగంగా అడుగులు ముందుకు వేసేది. అడిగితే సమాధానం చెప్పడేమో అని నడక మానేసేది. చీకాకుతో కూడిన తొట్రుబాటు వలన మళ్ళీ ముందుకు అడుగు వేసేది. మళ్ళీ ఆగేది. అలా నడిచే టప్పుడు తడబడుతూ అడగులు వేసేది.