పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: నారద తత్వ సంకేత పదాలు

నారదుడు చెప్పిన తత్వశాస్త్ర సాంకేత పదాలు

దేహము - రథం;
బుద్ధి - సారథి;
ఇంద్రియాలు - గుర్రములు;
మనస్సు - కళ్ళెం;
పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణ వాయువులు - రథం ఇరుసులు;
ధర్మం, అధర్మం - రథచక్రాలు;
చిత్తం - కఠినమైన బంధం;
పంచేంద్రియ విషయములు - సంచార భూములు;
అహంకార సమేతుడైన జీవుడు - రథికుడు;
ప్రణవం - ధనుస్సు;
శుద్ధ జీవుడు - బాణం;
బ్రహ్మము - పరమ లక్ష్యం;
రాగద్వేషాదులు - అడ్డుపడే బద్ధ శత్రువులు
భక్తి - కత్తికి సానపెట్టుట
జ్ఞానము - ఖడ్గము
రాగద్వేషాదులు

రథికుడు రథాన్ని వశం చేసుకుని, శత్రువులను జయించి, ధనుస్సు ఎక్కుపెట్టి, బాణంతో పరమ లక్ష్యాన్ని ఛేదించాలి; అదే పరమ ధర్మం
రథికుడు అప్రమత్తంగా ఉంటే, ఇంద్రియాలనే గుర్రాలు, పసిగట్టి, బుద్ధి అనే సారథితో సహా రథమును ప్రవృత్తి మార్గంలోకి లాగి, విషయ శత్రు వ్యూహం మధ్యలో పడవేస్తాయి.శత్రువులు విజృంభించి సంసార కూపంలో పడేస్తాయి