పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: గజేంద్ర మోక్షంలో సంకేత పదాలు

గజేంద్రమోక్షణంలో సంకేత పదాలు

1. (అశ్వత్థ) పాదపములు – సంసారం
2. అంకురం - దేహమే ఆత్మ అను నిశ్చయము.
3. అడవిపందులు – లోభం
4. అనంగ – ఉపాధి రహిత ఆత్మ జ్ఞానం
5. అనన్య పురుష సంచారం – ఏకాంతం, నిస్సంకల్పం, విశుద్ధం
6. అయస్సార, ఇనుము – తమోగుణం, ప్రతిబింబం రుద్రుడు
7. అరణ్యం – లింగ శరీరం
8. ఇందిందీవరం – తృష్ణ
9. ఎనుబోతులు – మదం
10. ఏనుగు గున్నలు – అవిద్యతోకూడిన పారమార్థిక జీవుల
11. ఏనుగు గున్నలు – అవిద్యావృత పారమార్థిక జీవులు
12. ఏనుగు దంతములు – వృత్తులు
13. ఏనుగు మదము – ఆజ్ఞాన చక్రము నందలి నాదాను సంధానం
14. ఓతప్రోతములు – పడుగుపేక గా కూర్పబడిన పర బ్రహ్మం.
15. కనకమయం – హిరణ్మయ మండలము
16. కమఠ – లోభం
17. కమఠ (తాబేలు) - లోభం
18. కరణీ విభుడు – అంతఃకరణం
19. కరేణు విముక్త మౌక్తిక పంక్తులు – బీజాక్షరములు
20. కలధౌత, వెండి – సత్వగుణం, ప్రతిబింబం విష్ణు
21. కలహంస – అసత్తు సత్తు విభాగక జ్ఞాని
22. కల్హారము – హృత్పద్మములు
23. కాసారం – పై క్షుత్పిపాసాది, షడూర్ముల స్థానము
24. కాసారం –మనస్సు
25. కాసారము – మనస్సు
26. కుతుకుల నిండ ద్రావుట – తృప్తులగుట
27. కృష్ణ – కృ అనగా సత్తు (భూ వాచకం, భూ సత్తాయాం), షకారం అనగా చిత్తు, ణకారం అనగా నర్వృతిః (ఆనందం), సత్ చిత్ ఆనందం, “సచ్చిదానందం”.
28. కృష్ణ – సచ్చిదానందము
29. కొండలు – కష్టములు సంప్రాప్తించునవి
30. కొండలు – కష్టాలు
31. కోక (తోడేలు) – మాత్సర్యం
32. కోతులు – మత్సరం
33. క్షీరము – సచ్చిదానంద రూపాత్మక బ్రహ్మము, సత్తు
34. క్షుత్తు – కర్మాది సుఖాభాసములు
35. గండస్థలము – ఆజ్ఞాచక్రము
36. గజములు – కూటస్థాది చైతన్య రూపములు
37. గుహలు – మూలాధారాది
38. గుహలు నుండి బయలు వెడలుట – అజ్ఞాన వృత్తులు బయలు దేరుట
39. గ్రాహ – కామం
40. గ్రాహం (మొసలి) – కామం
41. ఘట్టన – ఉచ్ఛ్వాస నిరోధం
42. ఘూక (గుడ్లగూబ) – చీకటిలో తిరుగునది, ఆత్మ జ్ఞానము లేక ప్రపంచ దృష్టి కలిగి ఉండుట
43. చక్రవాక – అసూయ
44. చక్రవాకం – అసూయ
45. చివర కొమ్మలు – ఇంద్రియములు
46. చివురులు – పుణ్యములు
47. జంబూకం (నక్క) - మదము
48. జగములు – శరీరం
49. జగములు – శరీరములు
50. ఝంకారం – ఆజ్ఞా చక్రము నందలి నాదము
51. ఝల్లీ (ఈలపురుగు) – కాముకుని తీవ్ర సంకల్పం
52. తొండము – ఉచ్ఛ్వాసం (ప్రాణాయామము)
53. తొండములు – ప్రాణాయామం
54. త్రిశృంగములు, మూడు శిఖరాలు - త్రిగుణములు
55. దోహజము (జలము) – కర్మము
56. నటదిందీవర – తృష్ణ
57. నవపుల్లాంభోజ – అనాది అవిద్యా వాసనలతో కూడిన హృత్పద్మం
58. నవపుల్లాంభోజ – అనాద్య విద్య వాసనలు
59. నీరము – మాయాకల్పిత నామ రూపాత్మక జగత్తు, అసత్తు
60. నెమళ్ళు – ఈర్ష్య
61. పంచాననం, సివంగి – సమ్మోహనం
62. పండుటాకులు – పాపములు
63. పగలు – జ్ఞాన ప్రకాశము ఉండుట, విద్య
64. పదివేల యోజనాలు – అనంతము
65. పద్మము – హృదయము
66. పాదపం (వృక్షం) – సంసృతి
67. పిడుగు – ఆపదలు
68. పిడుగులు – ఆపదలు సంభవించునవి
69. పిపాస – విలాసేచ్ఛ
70. పుచ్ఛము ఊపుట – బుద్ధి చలించుట
71. పులుల – కామం
72. పుష్పముల సువాసనలు – మంత్ర వాక్కులు
73. పుష్పములు – శబ్దాది విషయములు
74. పుష్పరస స్రావం – ఆత్మానాత్మ విచారణ జనిత సంతోషం
75. పొదరిళ్ళు – ఆశాలత
76. ప్రవాహములు – వాసనలు, శుభ అశుభముల నడక.
77. ప్రియురాలు – మనస్సు
78. ఫణి – శౌర్యం
79. ఫలము – బ్రహ్మ జ్ఞానం
80. ఫలములు – అనేక జన్మ కృత కర్మ వాసనా జనిత ప్రారబ్దానుభవ ధుఃఖము
81. బక, కొంగ – దర్పం
82. బకం (కొంగ) – దర్పం
83. బీజము – అజ్ఞానం
84. బుద్బుదములు – దుస్సంకల్పములు
85. భల్లూకము (ఎలుగుబంటి) – కామం
86. భల్లూకములు – క్రోధం
87. భిల్లీ – నిర్దయత్వము
88. భ్రమరం ఊర్ధ్వ అదో గతి సంచారం – అసంతుష్టిచే భ్రమరం వ్యభిచరించుట
89. మణివాలు కానేక విమల పులిన – రాబోవు దుఃఖాలను మరుగు పరచి సద్యోఫలంబులు కలిగించు అభాసా సుఖములు
90. మదజల, మదించిన చలము, పట్టుదల – కర్తృత్వాది అహంభావం
91. మధుపం, భ్రమరం –హృదయ పద్మమున వసించెడి తృష్ణ
92. మధుపము – పారమార్థిక జీవి
93. మధుపములు – పారమార్థిక జీవులు
94. మరాళం – మోహం
95. మరాళం (నెమలి) – మోహం
96. మరిగి తిరిగెడు విమానములు – దేహములు
97. మాతంగ మల్లము – జీవుడు
98. మాతంగీ (ఏనుగు) – పరాప్రకృతి
99. మీన – మోహం
100. మీన (చేప) - మోహం
101. మొగ్గలు – సద్గుణములు
102. రాజు – పరమ హంస
103. రాత్రి – జ్ఞాన ప్రకాశము లేకపోవుట, అవిద్య
104. లత యను గుబురులు – భక్తి
105. లతా నిర్మిత కుటీర తీరం – శుద్ధసాత్వికం
106. లులాయకం – బద్దకం
107. లేజిగురు – రాగము (విరోచన మతము)
108. లేళ్ళు – మోహం
109. వలీముఖము – తృష్ణ
110. వసంతాగమనము – ఈశ్వర ధ్యానము
111. విష్ణు చక్రము – బ్రహ్మ జ్ఞాన చక్రము
112. విహంగము – తత్ఫల భోక్త యగు జీవుడు
113. వ్యాఘ్రం, పెద్ద పులి - క్రోధం
114. వ్యాధకుడు (వేటగాడు) – రామచంద్రుడు
115. శరభం (సింహాలను తినే జంతువు) - ప్రలోభం
116. శుక పికాది ద్విజ సంయుతములు – తత్ఫౌఖ్యాదులను దుఃఖములుగా గ్రహించునవి
117. షడూర్ములు – 1ఆకలి 2దప్పిక, 3శోకం 4మోహం, 5జర 6మరణం
118. సకల దోష జలరూప ప్రవాహిని – నింద్యమైన బుద్ధి
119. సమీప సంచారం – నభోంతరాళంబు సంచారం
120. సవరపు మృగం – అసూయ
121. సింగము – పట్టుదల
122. సింగము వలె పట్టుదల కలుగుట – కామాదుల జయించుట
123. సుమనః (పుష్పం) – శుద్ధసాత్వికం
124. స్కంధం – స్థూల ఉపాధి
125. స్తనద్వజం – జీవేశ్వరులు
126. హరిణి - (పులి అనే క్రోధం, శరభం అనే లోభం, పంచాననం అనే మోహం, భల్లూకం అనే కామం, జంబుకం అనే మదం, కోక అనే మత్సరములచే బాధింపబడునది) – చిత్తం
127. హిరణ్మయం, బంగారం – రజోగుణం, ప్రతిబింబం బ్రహ్మ
128. హిరణ్య – సూత్రాత్మ, సూర్యచంద్రాది కాంతులు.
129. హృత్పద్మషట్పదీ – తృష్ణ
130. శుకుడు – స్వస్వరూపము అనగా ఆత్మతత్వం లేదా “బ్రహ్మజ్ఞానం” తెలిసికొని రాగాదులను వదలి తద్వారా ఆ జన్మ లోనే ముక్తిని పొందుటను సద్యోముక్తి, విహంగమార్గం, శుకమార్గం అంటారు. దీని ఆవిష్కరించిన వాడు శుకుడు.
131. శుక మార్గం – కైవల్య సాధనమునకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి “శుక మార్గం” దీనినే “విహంగ మార్గం” అని అంటారు. ఇదే “సద్యోముక్తి మార్గం”. తక్షణం మోక్షాన్ని అందించే మార్గం అన్నమాట. ఇంకొకటి “వాసుదేవ మార్గం”. దీనిని “పిపీలకా మార్గం” అని “క్రమముక్తి” మార్గం అని అంటారు.
132. “సుధారాశి”, “పాల సముద్రం” – “శ్లో. ప్రత్యగ్వస్తునిని స్తరంగసహజా; నందావబోధాంబుధౌ” ఏ స్థితి యందు ఇతరము చూడడో, వినడో, ఎరుగడో, ఆ స్థితి అందు భూమా బ్రహ్మానందం అంటారు.

వ. సం. చక్రాల నామములు అధిదేవతలు రంగులుబీజాక్షరాలు
1 మూలాధారం గణపతి - పీత పసుపువర్ణం వ, శ, ష, స
2 స్వాధిష్టానం బ్రహ్మ రక్తవర్ణం బ, భ, మ, య, ర, ల
3 మణిపూరం విష్ణువు నీలవర్ణం డ, ఢ, ణ, త, థ,
ద, ధ, న, ప, ఫ
4 అనాహతం శివుడు శ్వేతవర్ణం క, ఖ, గ, ఘ, ఞ,
చ, ఛ, జ, ఝ
5 విశుద్ధం మాయాశక్తి (అవ్యక్తం) ఎరుపువర్ణం హం, క్షం
6 సహస్రారం శాంతకళ శుద్ధశ్వేతం, చంద్రతెలుపు ఈశ్వరుడు.