పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పరిశోధనలు : మనవి

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

భాగవతులకు సాదర మనవి

పరిశోధనలు వివరాలు; పరిశోధన పత్రాలు అందించ మనవి

బమ్మెఱ పోతనామాత్యులు అన్నా వారి భాగవతము అన్నా తెలుగులకు అమిత ఇష్టం. సామాన్యులకే కాదు పండితులకు, మహాపండితులకు సైతం ఆరాధ్యనీయులు వారు. అందుచేత సహజంగానే అనేక అమూల్య పరిశోధనలు వివిధ విశ్వవిద్యాలయాలలోనూ జరిగాయి; జరుగుతున్నాయి; జరుగుతాయి. ఇంకా అనంతమైన పరిశోధనల అవసరము; అవకాశము ఉంది. అవన్నీ ఏకప్రదేశంలో అందుబాటులోకి వస్తే మన భాషకు, సంస్కృతికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకని, కొందఱు భాగవతోత్తములు సూచించినట్లు, వాటన్నింటిని మీ తెలుగుభాగవతం.ఆర్గ్ లో ప్రత్యేక పుటలు పెట్టి అందింస్తే బాగుంటుంది కదండి.

ఆ ప్రయత్నం మీ ఆశీర్వచనంతో ఆరంభిస్తున్నాము. దీనిలో బమ్మెఱ పోతనామాత్యుల వారి గురించి కాని, వారి భాగవతాది రచనల గురించి కానీ, తెలుగు భాషలో వచ్చిన ఇతర మహాభాగవత కృతుల గురించి కానీ, ఏదైనా విశ్వవిద్యాలయము లేదా ప్రముఖ సంస్థ ద్వారా అనుమతి పొందిన పరిశోధనా పత్రాలు అంగీకరించబడతాయి. ఇది ఒక జాబితా రూపంలో ఉంటుంది, ప్రచురణ జరిగితే జరిగిందని, వీలయితే వివరాలతోను, అంతర్జాలంలో ప్రచురణ జరిగితే ఆ లింకు ఉంటాయి. ఈ జాబితాలో చూపబడె వివరాలు.
(అ) పరిశోధన అంశం, (ఆ) పరిశోధకుని పేరు, (అం) పర్యవేక్షకులు, (ఇ) విశ్వవిద్యాలయం, (ఈ) పట్టా అందించిన సంవత్సరం, (ఉ) పుస్తక ప్రచురణ, (ఊ) అంతర్జాల ప్రచురణ.
అంతేకాకుండా, వీలయిన పరిశోధనా పత్రాలు ఇక్కడ ప్రచురించి. వాటి లింకు (అ) పరిశోధన శీర్షికకు లింకు పెట్టబడతాయి. వీలయినంత సమగ్రంగా ఇది రూపుదిద్దుకోవాలి. వీలయిన పరిశోధన పత్రాలు మన తెలుగు భాగవతంలో ప్రచురించబడాలి. ఇది ఆశయం. నాకు తెలిసిన 1, 2 పరిశోధనల వివరాలతో ఆరంభించాము.

భాగవత పరిశోధకోత్తములారా! మీరు మాకెంతో గౌరవనీయ ఆత్మీయులు. మీ మీ పరిశోధక పత్రాల వివరాలు దయచేసి అందించండి. ఈ జాబితాలో ప్రచురించి విశ్వవ్యాప్తంగా ఉన్న మన ఆంధ్రులకు అందరకు అందుబాటులో పెడదాము. అంతేకాకుండా ఆ యా పత్రాలు తెలుగుభాగవతంలో ప్రచురించాలి అంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

భాగవతోత్తములు, పండితులు, భాగవత ప్రియులు, కవిహృదయులు, సహృయులు, కళాపోషకులు అందరిని ఈ మా ప్రయత్నానికి చెందిన మీకు తెలిసిన సమాచారం, పత్రాలు మున్నగునవి దయచేసి సమకూర్చి సహాయపడవలసినదిగా మనవి చేస్తున్నాము. ఆ యా వివరాలు పత్రాలు తెలుగుభాగవతము తాలూకు నియమాలను అనుసరించి పూర్తి ఉచితంగా విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. పొరపాటున అ ప్రమాణికములైన వివరాలు చేరితే మన్నించి తెలియబరచండి సరిచేసుకుంటాం.