పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పరిశోధనలు : భాగవత రత్న పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :



EMBLEM

తెలుగు భాగవత ప్రచార సమితి
హైదరాబాద్, తెలంగాణా, ఇండియా.
(85/2015 సంఖ్యతో నమోదైన సంస్థ; Regd. Trust wide no. 85/2015)
చరవాణి: +91 9959 61 3690; +91 9000 00 2538.

బెంగళూరు,
2024-02-16.

సా.శ. 2024వ (క్రోధి నామ)సంవత్సరానికిభాగవత రత్న పురస్కారం కొఱకు దరఖాస్తులు ఆహ్వానం

దరఖాస్తులు అందుకొనుటకు చివరి తేదీ: 2024-05-30

 తెలుగు భాగవత ప్రచార సమితివారు 2024 (క్రోధి నామ) సంవత్సరానికి గాను భాగవత రత్న పురస్కార ప్రదానం; ఎనిమిదవ (8) ఏడాది, శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వామివారి అనుజ్ఞ ప్రకారం చేయదలచిరి. ఇందునిమిత్తమై, అర్హులైన పరిశోధకులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.. ఎంపికైన పరిశోధకునికి పురస్కార పత్రము, సత్కారము ఉంటాయి.

నియమాలు :-
*సదరు పరిశోధకులు కాని ఇతరులు కాని వివరాలు అందించవచ్చు. వివరాలు 2024, మే 30వ తారీఖు లోపున అందేలా పంపవలెను.
*తెలుగులో వచ్చిన భాగవతంపై; కాని సహజ కవి పోతనామాత్యులు లేదా వారి రచనలపై కాని చేసిన పరిశోధనకు పిహెచ్. డి. లేదా ఎమ్,ఫిల్ వంటి పట్టా పొంది ఉండాలి.
*సదరు పట్టా గత పది ఏళ్ళలో పొంది ఉండాలి.
*సదరు పరిశోధకుని పేరు, స్పష్టమైన సంపర్క వివరాలు, పరిశోధనాశం, సంవత్సరం, గైడు పేరు, విశ్వవిద్యాలయం పేరు అందించాలి.
*పరిశోధనా పత్రం పిడిఎఫ్ రూపంలో కాని యూనీకోడు లిపి దస్త్రంగా కాని సమర్పించాలి.
*అలా సమర్పించుట, సదరు పరిశోధనా పత్రం తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడులో ప్రచురించుటకు అంగీకారం, అనుమతి ధృవీకరించినట్లే. అట్లుకానిచో, ప్రచురించవలదు అని విస్పష్టంగా తన ధరఖాస్తులో తెలియజేయాలి.
*(vsrao50@gmail.com కు ) /(bhagavatapracharasamiti@gmail.com కు ) కు వేగరి సందేశం రూపంలో దరఖాస్తులను పంపాలి,
*సదరు పరిశోధనా పత్రములపై ఎంపిక మండలి సభ్యులు వారి సూచనలను సమర్పిస్తారు. అధ్యక్షులవారు శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వామివారు అభ్యర్థి నిర్ణయం అనుగ్రహిస్తారు.
* పురస్కార ప్రదానం విషయంలో కాని, జాలగూడులో ప్రచురించు విషయంలో కాని తెలుగు భాగవత ప్రచార సమితిదే తుది నిర్ణయం. ఎట్టి సంప్రదింపులు అనుమతింపబడవు.

- భాగవత గణనాధ్యాయి, ట్రస్టీ - అద్యక్షులు
తెలుగు భాగవత ప్రచార సమితి.

పరిశోధనలు : జాబితా