పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పరిశోధనలు : భాగవతరత్న పురస్కారం ఎంపికకు ధరఖాస్తులు ఆహ్వానం

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :EMBLEM

తెలుగు భాగవత ప్రచార సమితి
హైదరాబాద్, తెలంగాణా, ఇండియా.
(85/2015 సంఖ్యతో నమోదైన సంస్థ; Regd. Trust wide no. 85/2015)
చరవాణి: +91 9959 61 3690; +91 9000 00 2538; +91 8826 33 3690;

హైదరాబాద్,
2019-01-25,

భాగవత రత్న పురస్కారం 2019 ఎంపికకు ధరఖాస్తులు ఆహ్వానం

తెలుగు భాగవత ప్రచార సమితి 2019 (వికారి నామ) సంవత్సరానికి గాను భాగవత రత్న పురస్కార ప్రదానం చేయదలచినది. ఇందునిమిత్తమై, అర్హులైన పరిశోధకులను సూచించగోరుతున్నాము. ఎంపికైన పరిశోధకునికి పురస్కార పత్రము మఱియు ఒక ఆండ్రాయిడు టాబ్లెట్ ఉంటాయి.
నియమాలు:
* సదరు పరిశోధకులు కాని ఇతరులు కాని వివరాలు అందించవచ్చు. వివరాలు 2019, ఏప్రిలు 30వ తారీఖు లోపున అందేలా పంపవలెను.
* తెలుగులో వచ్చిన భాగవతంపై; కాని సహజ కవి పోతనామాత్యులపై కాని చేసిన పరిశోధనకు పిహెచ్.డి లేదా ఎమ్,ఫిల్ పట్టా పొంది ఉండాలి.
* సదరు పట్టా 2007 లేదా తరువాత కాని పొంది ఉండాలి.
* సదరు పరిశోధకుని పేరు, స్పష్టమైన సంపర్క వివరాలు, పరిశోధనాశం, సంవత్సరం, గైడు పేరు, విశ్వవిద్యాలయం పేరు అందించాలి.
* పరిశోధనా పత్రం పిడిఎఫ్ రూపంలో కాని యూనీకోడు లిపి దస్త్రంగా కాని సమర్పించాలి.
* సదరు పత్రం మన జాలగూడులో ప్రచురించవలెను అంటే తగిన అనుమతి పత్రం కూడ జతచేయాలి.
*(bhagavatapracharasamiti@gmail.com కు ), లేదా (vsrao50@gmail.com కు ) వేగరి సందేశం రూపంలో ధరఖాస్తులను పంపాలి,
* పురస్కార ప్రదానం విషయంలో కాని, జాలగూడులో ప్రచురించు విషయంలో కాని తెలుగు భాగవత ప్రచార సమితిదే తుది నిర్ణయం. ఎట్టి సంప్రదింపులు అనుమతింపబడవు.

- భాగవత గణనాధ్యాయి.
తెలుగు భాగవత ప్రచార సమితి.