పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సేచనము

సేచన అంట్ 

చిలకరించుట, జల్లుట, తడపుట, 

నైష్ఠిక కర్మలను అనుసరించడంలో మంత్రోదకాన్ని చిలకరించడం, చల్లడం, తడపటం లాంటి క్రియలు ఉంటాయి ఈ క్రియలకు సేచన అని పేరు. ఇందులో ప్రోక్షణం, అవోక్షణం, అభ్యుక్షణం అనే అంగాలు ఉన్నాయి. ప్రోక్షణం అంటే అర చేతిని వెల్లకిల ఉంచి శిరస్సు మీద నీళ్లు చల్లుకోవడం అనే క్రియ. అవోక్షణం అంటే అరచేతిని నేల వైపు తిప్పి శుద్ధి కోసం మంత్రోదకాన్ని చిలకరించడం. అభ్యుక్షణం (అభి + ఉక్షణం) అంటే యాగాలు చేయడం వంటి కార్యాలలో అరచేతిని సంపుటీకరించి జలాన్ని అడ్డంగా చల్లడమనే క్రియ. ఇలా మూడు అంగాలు ఉన్నాయి. (పారమార్థిక పదకోశం, పొత్తూరి వేంకటేశ్వరరావు)