పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : రాసక్రీడా రీతులు

రాసక్రీడా వర్ణనలో వాడిన రీతులు - నాట్యశాస్త్ర సాంకేతిక పదాల సంఖ్యలు:-

68 రీతులు - 12 విభాగాలు
తెలుగుభాగవతం.ఆర్గ్ > వివరణలు > వ్యాసములు > రాసక్రీడ
(అ) రాసము జంటలు జంటలుగ నుండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్య విశేషము;
(ఇ) త్రిభంగి - మువ్వంకల భంగిమ, మూడు వంకరలు (1కుడికాలు మీద ఎడమకాలు వంకరగా బొటకనవేలు నేలను తాకునట్లు పెట్టుటచేనగు వంకర 2తల ఎడమపక్కకు వాల్చుటచేనగు వంకర 3కుడి చేతిని వంచి వేణువురంధ్రవులందు వేళ్ళూనుట యందలి వంకర అనెడ మూడు వంకరలు) కలుగునట్లు వేణుమాధవుడు నిలబడెడి భంగిమ;
(ఉ) భంగిమ నిలబడెడి విధానము
1) రాసబంధము – రాసములో ఒకరిని ఒకరు పట్టుకొనుట – 12 రకములు
2) తానకములు - నటించు వేయు విధములు – 8 రకములు
3) పాదకర్మలు - అడుగులు వేయు విధములు – 3 రకములు
4) పార్థివచారములు - చరించు విధములు – 4 రకములు
5) వ్యోమాచారములు - గాలిలో కాలు కదుపుట – 3 రకములు
6) కరభావము - హస్త ముద్రలు వేయుట – 8 రకములు
7) జానువర్తనలు - కాలు మడచు విధములు – 3 రకములు
8) దైవమండలము - చేతులను ఆకాశముకేసి చాచి నటించుట – 4 రకములు
9) కరణములు - నటనా విధానములు – 7 రకములు
10) చూడ్కులు - చూసెడి విధానాలు – 4 రకములు
11) శిరోభావములు - తలను ఉంచు విధములు – 6 రకములు
12) అంగహారములు - భావ సూచక విధములు – 6 రకములు