పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కామాదుల జయించు సూత్రాలు

కామాదుల జయించు సూత్రాలు
(7-457-వ.)

సంకల్ప వర్జనంతో - కామాన్ని,
కామ వర్జనంతో - క్రోధాన్ని,
అర్థానర్థ దర్శనంతో - లోభాన్ని,
అధ్వైతానుసంధానంతో - భయాన్ని,
ఆత్మానాత్మ వివేకంతో - శోకమోహాలను,
సాత్త్వికుల సేవతో - కపటాన్ని,
మౌనంతో - యోగ విఘ్నాన్ని,
శరీరవాంఛలు వర్జించుటతో - హింసను,
సమాధి బలంతో - దైవికబాధను,
ప్రాణాయామంతో - మన్మథ వాంఛను,
సాత్త్వికాహారంతో - నిద్రను,
సత్త్వగుణంతో - రజస్తమోగుణాలను,
వినయంతో - బలోద్రేకమును.