పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : ముందుమాట

ర్గ, ప్రతిసర్గ, మనువులు, మన్వంతరము, వంశాను చరితములు అన్నవి పురాణ పంచ లక్షణాలు. ప్రధానంగా పురాణాలు – మత్య్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్పహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ,అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు యని 18. వానిని అష్టాదశపురాణాలు అంటారు. శ్లో. మద్వయం, భద్వయం, చైవ బ్రత్రయం, వచతుష్టయం. అ, నా, ప, లిం, గ, కూ, స్కాని పురాణాని పృథక్ పృథకి. ఇంకా అష్టాదశ ఉపపురాణాలు మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే యీ అష్టాదశ పురాణాలలోను ముఖ్యమైనది భాగవతం అనే మహా పురాణం.

భాగవత మహాపురాణం అంటేనే భగవంతుని గురించి, భగవంతునికి చెందిన భాగవతుల గురించి. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వమయుడు, సర్నశబ్దవాచ్యుడు కదా. కనుక, ఈ పురాణంలో సర్గ (సృష్టి) మొదలు ప్రళయం వరకు సర్వము వస్తాయి. అవతారపురుషులు, భాగవతులు, భక్తులు అందరి కథల సమాహారం కూడా యిందులోనే ఉంటాయి. అందుకని భాగవత పురాణాన్ని ఒక మహా విశ్వం అనవచ్చు. విశ్వం లోని సర్వం దీనిలో సూచింపబడతాయి వాటిలో కొన్నిటిని అనువుగా ఉపయుక్తంగా క్రోడీకరించిన వానిని అనుయుక్తాలు అనుకున్నాను.

భాగవత గణనాధ్యాయానికి ప్రమాణముగా ఉండటం కోసం పోతన తెలుగు భాగవతము తయారుచేసా. దానికి టీక టిప్పణులను చేసేటప్పుడు, కొన్నిపదాలకు సంబంధించిన వివరణలు కొన్నిటిని అక్కడ టిప్పణుల వద్ద కన్న విడిగా క్రోడీకరించుట యుక్తమని భావించి, అనువుగా వుంటుందని అనుకొని, ఉపయుక్తమని తలచి సంకలనంచేసాను. అవే యీ అనుయుక్తాలు. వీటిని వివిధ నిఘంటువులు, బాలశిక్షలాంటి పుస్తకాలు, తెలుగు వికిపీడియా వంటి కొన్న అంతర్జాజాల స్థలములు, భాగవతముపై కొందరు మహానుభావుల వ్యాఖ్యానాలు మున్నగు వివిధ గ్రంధాల నుండి తీసుకొని సంకలనం చేసాను. వాటిని అందించిన మహర్షులు, మహాత్ములు, పండితులు, ప్రచురణకర్తలు, సంస్థలు, నాకు వాటిని అందించిన ఉత్తములు అందరికి నా హృదయపూర్వక కృతఙ్ఞతా నమస్కారాలు. దీంట్లో ఏవైనా పొరబాట్లు, తప్పులు ఉంటే సహృదయంతో మన్నించగలరని మనవి.

ఇట్లు,
భాగవతగణనాధ్యాయి,
ఊలపల్లి సాంబశివ రావు