పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : యామ అనే దేవతలు 12 మంది

4-6-వ.
యామ అనే దేవతలు పన్నెండు మంది
యజ్ఞుడు – దక్షిణలకు పుత్రులు .
వారు స్వాయంభువాంతరమునందు
తుషితులు అనే దేవగణాలు అయ్యారు.
వారి పేర్లు . .
తోషుడు - తుష్టి కలవాడు
ప్రతోషుడు - సంతతివలన తుష్టికలవాడు
సంతోషుడు - సంతోషము కలవాడు
భద్రుడు - క్షేమము కలవాడు
శాంతి - శాంతి కలవాడు
ఇడస్పతి - యౌవనమునకు అధిపతైనవాడు
ఇధ్ముడు - సమిధలు కలవాడు
కవి - రూపములల్లువాడు, శుక్రధాతువు
విభుడు - ప్రభుత్వము కలవాడు
వహ్ని - అగ్నిదేవుడు
సుదేవుడు - మంచిదేవుడు
రోచనుడు - (కంటికి) వెలుగు యైనవాడు