పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : విష్ణుమూర్తి విరాడ్విగ్రహము

విష్ణుమూర్తి విరాడ్విగ్రహము

2వ స్కంధ, 16వ వచనం
 విరాడ్విగ్రహ వర్ణనలోని (అ)చతుర్దశలోకాలు – 14, (ఆ)అధిదేవతలు – 19, (ఇ)లక్షణాలు – 8, (ఈ)స్వరూపాలు – 9, (ఉ)గతులు – 3, (ఊ)జీవాలు – 7 చొప్పున మొత్తం అరవై (60) వర్ణనల తాలూకు వివరములు.:-

1. విరాడ్విగ్రహంలో చతుర్దశ లోకముల స్థానం

1.1. ఏడు అథోలోకములు
1.1.1. అరికాళ్ళు – పాతాళము
1.1.2. పాదములు – రసాతలము
1.1.3. చీలమండలు – మహాతలము
1.1.4. పిక్కలు – తలాతలము
1.1.5. మోకాళ్ళు – సుతలము
1.1.6. తొడలు – వితలము
1.1.7. జఘనము - అతలము
1.2. ఏడు ఊర్థ్వలోకములు
1.2.1. నడుము – మహీతలము (భూమి)
1.2.2. నాభి – నభస్థలము
1.2.3. వక్షస్సు – నక్షత్ర లోకము
1.2.4. మెడ – మహర్లోకము
1.2.5. ముఖము / నోరు – జన లోకము
1.2.6. నుదురు – తపో లోకము
1.2.7. నడినెత్తి – సత్ లోకము

2. విరాడ్విగ్రహ అవయవ స్థాన అధి దేవతలు

2.1. బాహుదండములు – ఇంద్రాది దేవతలు
2.2. చెవులు – దిక్కులు
2.3. ముక్కుపుటములు – అశ్వనీ దేవతలు
2.4. నోరు – అగ్ని
2.5. కన్నులు – సూర్యుడు
2.6. కనురెప్పలు – రాత్రింబవళ్ళు
2.7. కనుబొమ్మలు – బ్రహ్మము
2.8. అంగిలి – వరుణ దేవుడు
2.9. బ్రహ్మ రంధ్రము – వేదము
2.10. కోరలు – యముడు
2.11. పురుషాంగం – ప్రజాపతి
2.12. వృషణములు – మిత్రావరణులు
2.13. మనస్సు – చంద్రుడు
2.14. అహంకారం – రుద్రుడు
2.15. బుద్ధి – మనువు
2.16. నివాసము – పురుషుడు
2.17. సంగీత స్వరములు – గంధర్వులు, విద్యాధరులు, చారణులు, నాలుగు విధాల అప్సరసలు
2.18. స్మరణ – ప్రహ్లాదుడు
2.19. వీర్యము – దైత్య దానవులు

3. విరాడ్విగ్రహం అవయవాల లక్షణాలు

3.1. దంతములు – స్నేహ వాత్సల్యములు
3.2. నవ్వులు – మాయ అను ప్రకృతి
3.3. కటాక్షములు – సృష్టి దొంతరలు
3.4. పెదవులు – లజ్జా లోభములు
3.5. స్తనములు – ధర్మమునకు మార్గాలు
3.6. వీపు – అధర్మము
3.7. హృదయము – ప్రధానము అనబడు మూలప్రకృతి
3.8. చిత్తము – మహత్తు అను తత్వము

4. విరాడ్విగ్రహం అవయవాల స్వరూపాలు

4.1. కడుపు - సముద్రములు
4.2. ఎముకలు – పర్వతములు
4.3. రక్తనాళములు, నరములు - నదులు
4.4. దేహం మీది వెంట్రుకలు – చెట్లు
4.5. తల మీది జుట్టు – మేఘములు
4.6. వస్త్రములు – సంధ్యలు
4.7. నామములు – సమస్త నామరూప సంజ్ఞలు
4.8. ధనములు – హవిస్సులు
4.9. సత్కర్మలు - యజ్ఞములు

5. విరాడ్విగ్రహం అవయవాల గతులు

5.1. ఊపిరులు – గాలి కదలికలు
5.2. విభాగాలు లేని కాలం – వయస్సు
5.3. కర్మలు – జీవులు జనన మరణాలు, సంసార నడకలు

6. విరాడ్విగ్రహం అవయవాల జీవతత్వాలు

6.1. గోర్లు – గుర్రములు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు
6.2. మొలప్రాంతము – పశువులు
6.3. వాక్ నైపుణ్yaములు – పక్షులు
6.4. ముఖము – బ్రాహ్మణులు
6.5. భుజములు – క్షత్రియులు
6.6. తొడలు – వైద్యులు
6.7. పాదములు – శూద్రులు