పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : వసుదేవుని భార్యలు

వసుదేవుని భార్యలు - కృష్ణుని తల్లులు

1-260 –వ
శ్రీకృష్ణుడు తల్లుల కేడ్వురకు మ్రొక్కెను. వారు వసుదేవుని భార్యలైన దేవకుని పుత్రికలు 7గురు.
10.2-1129వ.
అని యభ్యర్థించి యమ్మునీంద్రుల యాజకులంగా వరించి, యప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామితవైభవంబున, నష్టాదశ భార్యాసమేతుండై దీక్షఁ గైకొని, యమ్మహాధ్వరంబు

వసుదేవుని భార్యలు 18మంది.

(10.2-1129-వ.)

1) భోజవంశమున పుట్టిన దేవకుని కుమార్తెలు 7గురు(కృష్ణుని తల్లులు)

(1) ధృతదేవి, (2) శాంతిదేవి, (3) ఉపదేవి, (4) శ్రీదేవి, (5) దేవరక్షిత, (6) సహదేవి, (7) దేవకీదేవి,
మరియు

2) పురువంశమున పుట్టిన 7గురు(బలరాముని తల్లులు)

(1) పౌరవి, (2) రోహిణి, (3) మధిరా, (4) రోచన, (5) ఆది (6) వైశాఖి (7)భద్ర

3. వీరుకాక వసుదేవునికి

(15) సునామ్నీ (16) కౌసల్య, (17) ఇళ
అనే మరి ముగ్గురు భార్యలు కలరు.

4) మరొక భార్య (18) కూడ కలదు.

5) దేవకీదేవి పుత్రుడు కృష్ణుడు
6) రోహిణి పుత్రుడు బలరాముడు6